Share News

Waqf Amendment Bill: వక్ఫ్ బిల్లును ఉపసంహరించుకోండి..ప్రధానికి స్టాలిన్ లేఖ

ABN , Publish Date - Apr 02 , 2025 | 09:37 PM

ప్రస్తుతం ఉన్న వక్ఫ్ చట్టంలోని నిబంధనలు కాలపరీక్షకు నిలిచాయని, వక్ఫ్ ఆస్తులకు రక్షణ కల్పించాయని స్టాలిన్ ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే వక్ఫ్ చట్టంలో కొత్తగా తీసుసువస్తున్న సవరణలు వక్ఫ్ నిర్వహణ, ఆస్తుల పరిరక్షణకు సంబంధించి బోర్డులకున్న అధికారాలు, బాధ్యతలను బలహీనపరచేలా ఉన్నాయన్నారు.

Waqf Amendment Bill: వక్ఫ్ బిల్లును ఉపసంహరించుకోండి..ప్రధానికి స్టాలిన్ లేఖ

చెన్నై: వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ (MK Stalin) బుధవారంనాడు లేఖ రాశారు. దేశంలోని ప్రతి పౌరుడు మతపరమైన హక్కులు కలిగి ఉంటారని, వారి హక్కులను పరిరక్షించాలల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని ఆయన అన్నారు. అయితే వక్ఫ్ చట్టం-1995 సవరణకు కొత్తగా చేసిన ప్రతిపాదనలు మైనారిటీల రక్షణను పరిగణనలోకి తీసుకోలేదని, ఇందువల్ల ముస్లింల ప్రయోజనాలు దారుణంగా దెబ్బతింటాయని చెప్పారు. ఈ అంశంపై ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలని కోరారు. వక్ఫ్ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ ఇటీవల ఒక తీర్మానాన్ని ఆమోదించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.

Waqf Amendment Bill: వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరలకు చోటు లేదు: అమిత్‌షా


ప్రస్తుతం ఉన్న వక్ఫ్ చట్టంలోని నిబంధనలు కాలపరీక్షకు నిలిచాయని, వక్ఫ్ ఆస్తులకు రక్షణ కల్పించాయని స్టాలిన్ ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే వక్ఫ్ చట్టంలో కొత్తగా తీసుసువస్తున్న సవరణలు వక్ఫ్ నిర్వహణ, ఆస్తుల పరిరక్షణకు సంబంధించి బోర్డులకున్న అధికారాలు, బాధ్యతలను బలహీనపరచేలా ఉన్నాయన్నారు. ఏ ఉద్దేశంతో అయితే వక్ఫ్ చట్టం చేశారో ఆ ఉద్దేశమే దెబ్బతింటుందన్నారు. ఉదాహరణకు రాష్ట్ర వక్ఫ్ బోర్డులతో ఇద్దరు ముస్లిమేతరులను తప్పసరిగా తీసుకోవాలనే ప్రతిపాదన వల్ల ముస్లింల మతపరమైన స్వయంప్రతిపత్తి బలహీనపడుతుందని అన్నారు.


'వక్ఫ్ బై యూజర్' నిబంధన తొలగించడం వల్ల అనేక చారిత్రక వక్ఫ్ ఆస్తుల పరిస్థితి అగమ్యగోచరమవుతుందని స్టాలిన్ వివరించారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకునే 2025 మార్చి 23న వక్ఫ్ సవరణ బిల్లు-2024ను ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించిందని ప్రధానికి రాసిన లేఖలో స్టాలిన్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

Waqf Bill 2024: మరోసారి దేశవిభజన కానీయం: అనురాగ్ ఠాకూర్

Waqf Amendment Bill: బిల్లులో ఒకే మార్పును కోరనున్న టీడీపీ.. అదేమిటంటే

Waqf: అసలేంటీ వక్ఫ్ బిల్లు, విపక్షాల రాద్ధాంతం దేనికి?

Line of Control: పాక్ కవ్వింపు చర్యలు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్

For National News And Telugu News

Updated Date - Apr 02 , 2025 | 09:39 PM