Home » CM KCR
Telangana Results: తెలంగాణ ఎన్నికల్లో గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యతను కనపబరుస్తున్నారు. ఇప్పటి వరకు 71 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా.. అధికార బీఆర్‌ఎస్ పార్టీ కేవలం 34 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది.
Telangana Elections: తెలంగాణలో బీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ముమ్మాటికీ 70 సీట్లకు పైగా బీఆర్ఎస్ యే గెలుస్తుందని.. మూడోవ సారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు.
2024లో తెలుగుదేశం - జనసేన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) స్పష్టం చేశారు. శనివారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన జరిగిన సమయంలో అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ పెట్టాను. తాను పార్టీని నడుపలేనని చాలామంది అన్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు.
Telangana Elections: తెలంగాణలో రేపు(ఆదివారం) ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. గెలుపు తమదే అంటే తమదే అంటూ అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలారెడ్డి వెరైటీ గిఫ్ట్ పంపించారు. బైబై కేసీఆర్ అంటూ కేసీఆర్‌కు సూట్ కేసును గిఫ్ట్‌గా పంపించారు.
కాంగ్రెస్ పార్టీ ( Congress party )పై ఉన్న అభిమానంతో ప్రజలు తమ పక్షాన నిలిచారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి భారీగా ఓట్లు వేసిన ప్రజలకు సహకరించిన మీడియాకు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్ఎస్ ప్రభుత్వం ( BRS GOVT ) ధరణిలో ఉన్న భూములను రాత్రికి రాత్రే పేర్లు మారుస్తున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ ( Madhuyashkigoud ) వ్యాఖ్యానించారు.
శనివారం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ను తెలంగాణ కాంగ్రెస్ నేతలు కలవనున్నారు. కేసీఆర్ ఓటమి భయంతో రైతు బంధు నిధులను ఇతర మార్గాలకు మళ్లిస్తున్నారని, కమీషన్ల కోసం రైతు బంధు నిధులు కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఆరోపించారు.
పోలింగ్ రోజున డైవర్ట్ చేయడానికి నీటి పంపకాల పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ( CM JAGAN ), తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( CM KCR ) నాటకాలను ప్రజలు చూస్తూ ఊరుకోరని తప్పకుండా గుణపాఠం చెబుతారని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ( Gidugu Rudraraju ) వ్యాఖ్యానించారు.
Telangana: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీపీఐ నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ ఆహ్వానించే పరిస్థితి రానుందన్నారు. ప్రశ్నిస్తున్నాడని ఒక్కపుడు కేసీఆర్... రేవంత్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయించారని.. అదే రేవంత్ రెడ్డికి స్వాగతం పలకడానికి కేసీఆర్ రెడీగా ఉండాలన్నారు.
Election Exit Polls -2023 : తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో అలా పోలింగ్ ముగిసిందో లేదో.. ఇలా ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్. ఇప్పటికే.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలో పోలింగ్ ముగియగా.. తెలంగాణలో నవంబర్-30న పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగియగానే జనాలంతా ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది..? ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారని చెప్పే ఎగ్జిట్ పోల్స్ కోసం టీవీలకు.. గూగుల్‌కు అతుక్కుపోయారు...