Revanth Reddy: ఓటమి భయంతో కేసీఆర్ రైతు బంధు నిధులను మళ్లిస్తున్నారు
ABN , First Publish Date - 2023-12-01T19:03:11+05:30 IST
శనివారం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ను తెలంగాణ కాంగ్రెస్ నేతలు కలవనున్నారు. కేసీఆర్ ఓటమి భయంతో రైతు బంధు నిధులను ఇతర మార్గాలకు మళ్లిస్తున్నారని, కమీషన్ల కోసం రైతు బంధు నిధులు కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఆరోపించారు.
హైదరాబాద్: శనివారం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ను తెలంగాణ కాంగ్రెస్ నేతలు కలవనున్నారు. కేసీఆర్ ఓటమి భయంతో రైతు బంధు నిధులను ఇతర మార్గాలకు మళ్లిస్తున్నారని, కమీషన్ల కోసం రైతు బంధు నిధులు కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్‌మెంట్ భూములను ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసే పక్రియ జరుగుతుందని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
"కేసీఆర్ ఓటమి భయంతో రైతు బంధు నిధులను ఇతర మార్గాలకు మళ్లిస్తున్నారు. కమీషన్ల కోసం రైతు బంధు నిధులు కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్‌మెంట్ భూములను ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసే పక్రియ జరుగుతుంది. ప్రభుత్వ అన్ని లావాదేవీలపై నిఘా పెట్టాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తాం. ప్రభుత్వ లావాదేవీలపై విజిలెన్స్ నిఘా పెట్టాలని, ఇటు హైదరాబాద్‌లో అటు ఢిల్లీలో ఎన్నికల సంఘం, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం." అని రేవంత్ రెడ్డి అన్నారు.