Home » CM KCR
బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే అయోధ్యలో శ్రీరామ చంద్ర మూర్తి దర్శన భాగ్యం ఉచితంగా కల్పిస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ( Yogi Adityanath ) తెలిపారు.
తెలంగాణను గాంధీ కుటుంబం నిండా ముంచిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ఆదివారం నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఖానాపూర్‌లో జరగనున్న బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. పట్టణంలోని అయ్యప్ప ఆలయం సమీపంలో గల సువి శాలమైన స్థలంలో బీఆర్ఎస్ నేతలు సభకు ఏర్పాట్లు చేశారు.
కూసుమంచి మండలం జీళ్ళచెరువు ఎన్నికల ప్రచారంలో పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.
Telangana Elections: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై వైఎస్సార్టీపీ అధినేత్ర వైఎస్ షర్మిలారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘‘సీఎంను ప్రజలు కలవాల్సిన అవసరం ఏముందంటున్న కేటీఆర్ గారు... అసలు మీకు జనం ఓటు వేయాల్సిన అవసరం ఏముంది?. ఓట్లేసి గెలిపించింది ప్రజలకు సేవ చేయడానికా లేక గడీల్లో భోగాలు అనుభవించడానికా?’’ అని ప్రశ్నించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ కాంగ్రెస్ ప్రజా విజయభేరి సభలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై దుమ్మెత్తిపోశారు. బీజేపీ -బీఆర్ఎస్ - ఎంఐఎం ఒక్కటే అని.. ఆ మూడు పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇది దొరలకు... ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు.
Telangana Elections: ఎన్నికల ప్రచారంలో భాగంగా కాగజ్‌నగర్ బీజేపీ సభలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొని ప్రసంగించారు. ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లు తీసుకువచ్చి ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు అన్యాయం చేయాలని చూస్తోందని విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.
Telangana Elections: బోధన్‌లో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ బీజేపీ, బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ నల్లచట్టాలు చేసి రైతులను మోసం చేస్తున్నారన్నారు. ‘‘నా పార్లమెంటు సభ్యత్వం రద్దు చేశారు.. నాకు ప్రభుత్వ ఇంటిని తొలగించారు’’ అని అన్నారు.
హైదరాబాద్, బెంగుళూరు దేశానికి కవలపిల్లలు అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. కర్ణాటకలో పాలన సెక్రటేరియట్ నుంచి నడుస్తోందని.. తెలంగాణలో మాత్రం పాలన ఫామ్ హౌజ్ నుంచి నడుస్తోందన్నారు. ఎమ్మెల్యేలను కొనడంలో కేసీఆర్ ఎక్స్‌పర్ట్ అన్నారు. గత రెండు ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారన్నారు.
సీఎం కేసీఅర్ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చాయి తప్ప వేరే ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చారా? అని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. నేడు ఖమ్మంలో జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ.. ఉద్యోగాలు రావాలంటే బీఆర్ఎస్‌ను అధికారం నుంచి తప్పించాలని ఆమె పిలుపునిచ్చారు.