Home » Congress Govt
తెలంగాణ వారసత్వాన్ని సగర్వంగా...సమున్నతంగా ముందుకు తీసుకువెళ్తానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ప్రజా సంక్షేమ శ్రామికుడిగా... మదిలో, విధిలో, నిర్ణయాల జడిలో... సకల జనహితమే పరమావధిగా ముందుకు సాగుతానని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
అన్నదాతల ఆత్మగౌరవాన్ని రేవంత్ ప్రభుత్వం దెబ్బతీసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులను రాజులను చేశామని కేటీఆర్ అన్నారు.
ఏడాదికి ముందు.. అతలాకుతలంగా, అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ. రాష్ట్ర రాబడులు నిర్దేశిత వ్యయాలకే సరిపోయే పరిస్థితి. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు కనిపించని దుస్థితి.
టూరిజం పాలసీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత పదేళ్లలో తెలంగాణకు ప్రత్యేక టూరిజం పాలసీ తయారు చేయలేదని అన్నారు. ఇవాళ(శుక్రవారం) తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూరిజం పాలసీపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
పైరవీలు లేకుండా పోలీసులకు పదోన్నతులు, బదిలీలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పోలీస్, ఫైర్ శాఖల్లో 15 వేలమందికి నియామక పత్రాలు అందజేసినట్లు వివరించారు. సైబర్, డ్రగ్స్ పేరుతో కొత్త నేరాలు పుట్టుకొస్తున్నాయని హెచ్చరించారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సెక్రటేరియేట్ లో తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి రేవంత్ రెడ్డి గౌరవం ఇస్తూ విగ్రహాన్ని పెట్టిస్తున్నారని షబ్బీర్ అలీ తెలిపారు.
దళితుల భూములను రాబందులా బీఆర్ఎస్ లాక్కుందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. ముగ్గురు నలుగురు తప్పా బీఆర్ఎస్ పార్టీలో ఎవరున్నారని అన్నారు. అంబేద్కర్ వర్ధంతి రోజు బీఆర్ఎస్ నేతల నిరసన ఏంటని నిలదీశారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అప్పులకు అదనపు ఆదాయం కలిపి బ్యాంకులకు కట్టే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు రూ.61 వేల కోట్లు వెచ్చించామని తెలిపారు.
కేసీఆర్ హయాంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశామని వివరించారు. ఇంటిగ్రేటెడ్ పాఠాశాలలతో అన్నికూలల అభివృద్ధికి పునాదులు పడుతున్నాయని మంత్రి ఉత్తమ్ చెప్పారు.
ప్రభుత్వం సాఫీగా నడవకుండా ఇబ్బందులకు గురి చేస్తేనే మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్లను అరెస్ట్ చేస్తామని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. తాము తప్పులేకుండా స్వేచ్ఛగా ప్రజాపాలన చేస్తున్నామన్నారు. 6 గ్యారెంటీల్లో ఐదు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని మల్లు రవి వివరించారు.