Minister Uttam: సన్న బియ్యం పంపిణీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన
ABN , Publish Date - Mar 28 , 2025 | 09:41 PM
Minister Uttam Kumar Reddy: హుజూర్ నగర్ నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రారంభిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో 85 శాతం జనాభాకు సన్నబియ్యం అందబోతోందిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని చాలామంది లబ్ధిదారులు ఉపయోగించుకోవడం లేదని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇవాళ(శుక్రవారం) సెక్రటేరియట్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎల్లుండి 30వ తేదీన ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు రాబోతుందని ఉద్ఘాటించారు. దొడ్డు బియ్యం కావడంతో డీలర్ల నుంచి బ్లాక్‌లో అక్కడక్కడా అమ్ముకోవడం జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
హుజూర్ నగర్ నుంచి సన్నబియ్యం పంపిణీని ప్రారంభిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో 85 శాతం జనాభాకు సన్నబియ్యం అందబోతోందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ తీసుకోవడానికి వీలుగా డ్రా సిస్టం అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు కావాలన్నా అర్హతను బట్టి ఇస్తున్నామని తెలిపారు. కొత్తగా ఫిజికల్ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
కార్డు ఉన్నా లేకున్నా లబ్ధిదారుల లిస్ట్‌లో ఉంటే సన్న బియ్యం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు నాటికి 89 లక్షల 73వేల 708 కార్డులు ఉండేవని... గత పదేళ్లలో 49వేల 479 కొత్త కార్డులు ఇచ్చారని గుర్తుచేశారు. 90 లక్షల రేషన్ కార్డులు... 2.85 కోట్ల లబ్ధిదారులు ప్రస్తుతం ఉన్నారని చెప్పారు. రూ. 10,665 కోట్ల నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఖర్చు చేస్తున్నాయని అన్నారు. త్వరలోనే బియ్యంతో పాటు పప్పు, ఉప్పు లాంటి వస్తువులు ఇస్తామని ప్రకటించారు. ఉగాది రోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సన్న బియ్యం కార్యక్రమం ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
High Court: ఎమ్మెల్యే సత్యంను బెదిరించిన వ్యక్తికి బెయిల్
Metro Rail: రోజుకు రూ.కోటిన్నర నష్టం.. మెట్రో చార్జీలు పెంచేందుకు అనుమతి ఇప్పించండి
Youth Firing Gun: అర్ధరాత్రి కారులో వెళ్తూ ఆ యువకులు చేసిన పని తెలిస్తే
Read Latest Telangana News and Telugu news