Home » Cricket news
తొలి రోజు కాస్తంత కంగారు పెట్టిన బంగ్లాదేశ్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. చెన్నైలో జరిగిన తొలి టెస్ట్‌లో ఏకంగా 280 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు టెస్ట్ మ్యాచ్‌లో సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదించింది.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఫామ్‌లో లేడు. పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో చెన్నైలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో కూడా కోహ్లీ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగులకే అవుటయ్యాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మైదానంలో ఉన్నంత సేపు చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాడు. బ్యాటింగ్ చేస్తున్నా, ఫీల్డింగ్ చేస్తున్నా తనదైన ఉత్సాహంతో కనిపిస్తుంటాడు. ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లతో కూడా సరదాగా మాట్లాడుతుంటాడు. ప్రస్తుతం చెన్నైలో బంగ్లాదేశ్, భారత్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తొలి రోజు బ్యాట్ పవర్ చూపగా.. రెండో రోజు తమ బంతి పదునేంటో రుచి చూపించింది. దీంతో శుక్రవారమే మ్యాచ్‌పై పట్టు బిగించింది.
కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (116) టోర్నీలో రెండో శతకంతో చెలరేగడంతో ఇండియా ‘డి’తో దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో ఇండియా ‘బి’ రెండోరోజు ఆఖరికి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 210 పరుగులు చేసింది.
టీమిండియాతో చెన్నైలో జరుగుతున్న తొలి టెస్ట్‌లో అద్భుత ఆరంభం అందుకున్న బంగ్లాదేశ్ అదే ఒరవడిని కొనసాగించలేకపోయింది. అద్భుత ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. 144 పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టి జోరు మీదున్న బంగ్లా బౌలర్లను అశ్విన్ (113), జడేజా (86) ఓ ఆట ఆడుకున్న సంగతి తెలిసిందే.
అంతర్జాతీయ క్రికెట్లో వైవిధ్య షాట్లతో స్కైగా పేరొందిన భారత జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మంగళవారం నగరానికి చేరుకున్నారు. ఓ హోటల్లో దిగాడు. స్థానిక అనంతపూర్ క్రికెట్ గ్రౌండ్ (ఏసీజీ)లో ఈనెల 19వ తేదీ నుంచి నిర్వహించనున్న దులీప్ ట్రోఫీ మూడో రౌండ్ ...
టీమిండియా కెప్టెన్‌గా, ఉత్తమ వికెట్ కీపర్‌గా, బెస్ట్ ఫినిషర్‌గా ప్రపంచ క్రికెట్‌పై తనదైన ముద్ర వేశాడు మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనీ. ఎంతో మంది ఆటగాళ్లతో కలిసి ఆడాడు. ఎన్నో ఘనతలు సాధించాడు. అయితే 2004లో జింబాబ్వే, కెన్యా పర్యటనల్లో ధోనీ ఆడిన తీరే అతడు టీమిండియాలోకి ఎంటర్ కావడానికి కారణం.
అనంతపు రం ఆర్డీటీ మైదానాల్లో జరుగుతున్న దులీప్ట్రోఫీ క్రికెట్ పోటీ లలో మూడో రోజు శనివారం మూడు సెంచరీలు నమోద య్యాయి. ఇం డియా-ఎ జట్టు రెండో ఇన్నింగ్స్ వికెట్ నష్టా నికి 115 పరు గులతో ఆట ప్రారంభించి.. 98 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 380 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇండియా- డి జట్టు 488 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ పారంభించి, మూడో రోజు ఆటముగిసే సమయానికి 19 ఓవర్లలో వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది.
టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ వచ్చాడు. గౌతమ్ గంభీర్ టీమిండియా కొత్త హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. సహాయక సిబ్బందిని ఎంచుకునే స్వేచ్ఛ తనకు ఇవ్వాలని కూడా ఆ సమయంలో గంభీర్ కండీషన్ పెట్టాడు. అనుకున్నట్టే తనతో గతంలో పని చేసిన వారిని సహాయక సిబ్బందిగా ఎంచుకున్నాడు.