Share News

IPL 2025, CSK vs RR: నితీష్ రాణా సూపర్ బ్యాటింగ్.. 10 ఓవర్లకు ఆర్ఆర్ స్కోరు ఎంతంటే

ABN , Publish Date - Mar 30 , 2025 | 08:22 PM

గౌహతిలోని బర్సాపార క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో రాజస్తాన్ రాయల్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ రుతురాజ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో రాజస్తాన్ రాయల్స్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది.

IPL 2025, CSK vs RR: నితీష్ రాణా సూపర్ బ్యాటింగ్.. 10 ఓవర్లకు ఆర్ఆర్ స్కోరు ఎంతంటే
Nitish Rana

గత రెండు మ్యాచ్‌ల్లో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ విభాగాల్లో విఫలమై ఓటములు చవిచూసిన రాజస్తాన్ రాయాల్స్ టీమ్ తాజా మ్యాచ్‌లో జూలు విదిల్చింది. గౌహతిలోని బర్సాపార క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో (IPL 2025) చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో రాజస్తాన్ రాయల్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ రుతురాజ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో రాజస్తాన్ రాయల్స్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది (RR vs CSK).


తొలి బంతికి చక్కటి టైమింగ్‌తో బౌండరీ రాబట్టిన యశస్వి జైస్వాల్ (4) ఆడిన మూడో బంతికే ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. తొలి ఓవర్లోనే జైస్వాల్ అవుట్ కావడంతో రాజస్తాన్ డిఫెన్స్‌లో పడినట్టు అనిపించింది. అయితే మరో ఓపెనర్ నితీష్ రాణా (33 బంతుల్లో 70) అనూహ్యంగా చెలరేగడంతో పవర్ ప్లేలో రాజస్తాన్ భారీ స్కోరు సాధించింది. వన్‌ డౌన్‌లో వచ్చిన సంజూ శాంసన్ (16 బంతుల్లో 21) మంచి ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో అవుటై పెవిలియన్ చేరాడు.


ప్రస్తుతం నితీష్ రాణాతో పాటు ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ (8 బంతుల్లో 4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్ ఒక్కో వికెట్ తీశారు. ప్రస్తుతం ఆర్‌ఆర్ 10 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. దాదాపు పది రన్ రేట్‌తో పరుగులు చేసింది.

ఇవి కూడా చదవండి..

IPL 2025, CSK vs RR: ట్రెండ్ మార్చిన చెన్నై.. ఆ ఇద్దరినీ జట్టు నుంచి తప్పించారుగా


IPL 2025: దుమ్మురేపుతున్న జియో హాట్‌స్టార్.. రికార్డులు బద్దలుగొడుతున్న వ్యూయర్‌షిప్


IPL 2025, CSK vs RR: చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్తాన్ రాయల్స్.. ఈ ఇద్దరిలో పైచేయి ఎవరిది


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 30 , 2025 | 08:22 PM