Home » Crop Loan Waiver
రైతు రుణ మాఫీ, రైతు భరోసా పథకాల కోసం ప్రభుత్వం రకరకాలుగా నిధుల వేటను సాగిస్తోంది. ప్రభుత్వ భూములను హామీగా పెట్టి ప్రైవేటు ఆర్థిక సంస్థల నుంచి బాండ్ల ద్వారా నిధులను సేకరించడం, ఏడాది పొడవునా తీసుకొనే బడ్జెట్ అప్పులను ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వంటి ప్రయత్నాలు చేస్తోంది.
రైతు భరోసా అంశంలో బీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే మతి భ్రమించి మాట్లాడుతున్నారని అనిపిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు బంధు అమలులో అనుసరించిన విధానాల వల్ల గత ప్రభుత్వం రూ.26,500 కోట్ల ప్రజాధనం దుబారా చేసిందని ఆరోపించారు.
రైతు సంక్షేమ పథకాలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.64 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని వ్యవసాయశాఖ ప్రతిపాదనలు తయారు చేసింది.
రుణ మాఫీ పథకం అమలుకు జూలై ఒకటో తేదీ నుంచే సర్కారు శ్రీకారం చుట్టనుంది. ఆగస్టు 15వ తేదీలోపు ప్రక్రియ మొత్తం పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు నిధులు సమీకరించాలని ఆర్థిక శాఖకు కూడా ఆదేశాలు వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ఏకకాలంలో రూ.2 లక్షల మేరకు రైతుల రుణాలను మాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో శని, ఆదివారాల్లో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలంటూ పార్టీ శ్రేణులకు టీపీసీసీ పిలుపునిచ్చింది.
ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను నెరవేర్చుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీకి సిద్ధమవడంతో ప్రతిపక్ష నేతలు తట్టుకోలేకపోతున్నారని
రుణమాఫీ ప్రక్రియను జూలై నుంచే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ అంశాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పింది. జూలై 17న తొలి ఏకాదశి పర్వదినం ఉంది.
రైతుల పంట రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రూ.2 లక్షల లోపు పంట రుణాలన్నింటినీ ఒకే దఫా మాఫీ చేసి, రైతులకు విముక్తి కలిగిస్తామని ప్రకటించింది. ఈ రుణాల మాఫీకి 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9 వరకు ‘కట్-ఆ్‌ఫ-డేట్’గా నిర్ణయించింది.
తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రుణాల మాఫీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రుణమాఫీకి కటాఫ్ నిర్ణయించింది. డిసెంబర్ 9వ తేదీని రుణమాఫీ కటాఫ్ తేదీగా ఏకగ్రీవ తీర్మానం చేసింది రాష్ట్ర కేబినెట్. అంతేకాదు.. రుణాలన్నింటినీ ఏకకాలంలో మాఫీ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది.
రైతులకు రుణమాఫీని తొలి ఏకాదశి, అంటే జూలై 17న మొదలుపెట్టనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రుణమాఫీ ప్రక్రియను జూలైలోనే ప్రారంభిస్తే అప్పటికే వ్యవసాయ పనులు ముమ్మరమై పెట్టుబడి అవసరమైన రైతులకు మళ్లీ రుణం తీసుకునేందుకు అవకాశం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.