Share News

ఇన్‌పుట్‌ సర్వీస్‌ డిస్ట్రిబ్యూటర్‌..

ABN , Publish Date - Mar 30 , 2025 | 04:19 AM

గత వారం ఇన్‌పుట్‌ సర్వీస్‌ డిస్ట్రిబ్యూటర్‌కు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ముఖ్యంగా ఇన్‌పుట్‌ సర్వీస్‌ డిస్ట్రిబ్యూటర్‌ అంటే ఏమిటి? దీని కింద ఎవరు...

ఇన్‌పుట్‌ సర్వీస్‌ డిస్ట్రిబ్యూటర్‌..

మరిన్ని విషయాలు..

గత వారం ఇన్‌పుట్‌ సర్వీస్‌ డిస్ట్రిబ్యూటర్‌కు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ముఖ్యంగా ఇన్‌పుట్‌ సర్వీస్‌ డిస్ట్రిబ్యూటర్‌ అంటే ఏమిటి? దీని కింద ఎవరు రిజిస్ట్రేషన్‌ తీసుకోవాలి? ఇలాంటి విషయాలు తెలుసుకున్నాం. అయితే ఒక ఇన్‌పుట్‌ సర్వీస్‌ డిస్ట్రిబ్యూటర్‌ తాను పొందిన క్రెడిట్‌ను వివిధ శాఖల మధ్య ఎలా పంపిణీ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.


ఉదాహరణకు హైదరాబాద్‌ కేంద్రంగా లక్ష్మీ సిల్క్స్‌ అనే ఒక షోరూమ్‌ ఉంది. ఇది ఒక కంపెనీగా రిజిస్టర్‌ అయ్యింది. దీనికి హైదరాబాద్‌తో పాటు విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబైల్లో కూడా షోరూమ్‌లు ఉన్నాయి. జీఎ్‌సటీ చట్టం ప్రకారం ఈ కంపెనీ తనకు షోరూమ్‌లు ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా రిజిస్టేష్రన్‌ పొందింది. అంటే, ఇవన్నీ ఒకటే పాన్‌ సంఖ్యతో పొందిన రిజిస్ట్రేషన్స్‌. ఈ షోరూమ్‌లు అన్నీ కూడా తమకు కావాల్సిన బట్టలు, ఇతర సరుకులను తమ షోరూమ్‌ పేరు మీదే ఇన్వాయి్‌సలు పొందుతాయి. కాబట్టి ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) పొందటంలోనూ, దానిని వాడుకోవటంలోనూ ఎలాంటి ఇబ్బంది లేదు. ఇబ్బంది అంతా కామన్‌గా పొందే సర్వీ్‌సలతోనే. ఉదాహరణకు ఆడిటర్లకు చెల్లించే ఫీజు, సాఫ్ట్‌వేర్‌ కోసం ఖర్చు పెట్టడం, ముఖ్యంగా ప్రకటనలు, ఇతర ప్రకటనల ఖర్చులు. వీటిని ఒకటే శాఖ కోసం ఉపయోగించరు కాబట్టి కంపెనీ ఇంతకు ముందు చెప్పినట్లు ఇన్‌పుట్‌ సర్వీస్‌ డిస్ట్రిబ్యూటర్‌ కింద రిజిస్ట్రేషన్‌ పొంది ఇలాంటి ఇన్వాయి్‌సలు అన్నీ ఆ రిజిస్ట్రేషన్‌ మీద తీసుకోవాలి. ఉదాహరణకు ఈ మార్చి నెలలో రూ.10 లక్షలు ఇన్‌పుట్‌ సర్వీస్‌ డిస్ట్రిబ్యూటర్‌ కింద క్రెడిట్‌ పొందారనుకుందాం. దీన్ని వివిధ బ్రాంచీలకు ఎలాం పంపిణీ చేయాలో ఇప్పుడు చూద్దాం.


ముందుగా ఈ బ్రాంచీలకు సంబంధించిన గత ఆర్థిక సంవత్సరపు టర్నోవర్‌ లెక్కించాలి. అంటే 2023-24 ఆర్థిక సంవత్సరం అన్నమాట. ఇందులో హైదరాబాద్‌ టర్నోవర్‌ రూ.12 కోట్లు, విజయవాడ రూ.6 కోట్లు, చెన్నై రూ.6 కోట్లు, ముంబై రూ.3 కోట్లు, బెంగళూరు రూ.3 కోట్లు టర్నోవర్‌ ఉందనకుందాం. అంటే మొత్తం టర్నోవర్‌ రూ.30 కోట్లు. ఇప్పుడు ఈ రూ.10 లక్షలను పంపిణీ చేయటానికి ముందుగా పొందిన సర్వీస్‌ ఏ శాఖకు సంబంధించినదో తెలుసుకోవాలి. ఉదాహరణకు రూ.10 లక్షల్లో రూ.2 లక్షలకు సంబంధించిన సర్వీస్‌ కేవలం హైదరాబాద్‌ బ్రాంచీ కోసం వాడినట్లయితే, ఆ మొత్తాన్ని ఆ బ్రాంచీకే పంపిణీ చేయాలి. అలా కాకుండా ఒకటికి మించిన బ్రాంచీలకు వాడినట్లయితే, టర్నోవర్‌ ఆధారంగా దామాషా పద్ధతిలో పంచాలి. ఉదాహరణకు కేవలం, హైదరాబాద్‌, విజయవాడ షోరూమ్స్‌ల్లోనే ఆధునికీకరణ జరిగింది. దానికి సంబంధించి పొందిన క్రెడిట్‌ రూ.6 లక్షలు అనుకుంటే, టర్నోవర్‌ ఆధారంగా హైదరాబాద్‌ శాఖకు రూ.4 లక్షలు, విజయవాడకు రూ.2 లక్షలు పంపిణీ చేయాలి. అలాకాకుండా పొందిన కామన్‌ క్రెడిట్‌ అంటే పైన చెప్పుకున్నట్లు మార్కెటింగ్‌, ఆడిటింగ్‌, ప్రకటనలు ఇలాంటి వాటికి సంబంధించిన క్రెడిట్‌ అన్నీ శాఖలకు సంబంధించినది కాబట్టి, ఇదే విధంగా దామాషా పద్ధతిలో టర్నోవర్‌ ఆధారంగా అన్నీ శాఖలకు పంచాలి.


క్రెడిట్‌ పంచేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన మరొక ముఖ్య విషయం ఏమిటంటే.. క్రెడిట్‌ను ఐజీఎ్‌సటీ, సీజీఎ్‌సటీ, ఎస్‌జీఎ్‌సటీ కింద పంచాలి. అంటే పొందిన క్రెడిట్‌ ఐజీఎ్‌సటీ అయితే అన్ని శాఖలకు ఐజీఎ్‌సటీ కింద పంపిణీ చేయాలి. అలాకాకుండా సీజీఎ్‌సటీ, ఎస్‌జీఎ్‌సటీ అయితే ఇన్‌పుట్‌ సర్వీస్‌ డిస్ట్రిబ్యూటర్‌ ఉన్న రాష్ట్రంలోని బ్రాంచీకి సీజీఎ్‌సటీ, ఎస్‌జీఎ్‌సటీ కింద, మిగిలిన బ్రాంచీలకు ఐజీఎ్‌సటీ కింద పంపిణీ చేయాలి.

అంటే పై ఉదాహరణలో ఇన్‌పుట్‌ సర్వీస్‌ డిస్ట్రిబ్యూటర్‌ రిజిస్ట్రేషన్‌ అనేది హైదరాబాద్‌ అడ్రస్‌ కింద పొంది ఉంటే సీజీఎ్‌సటీ, ఎస్‌జీఎ్‌సటీ క్రెడిట్‌ను హైదరాబాద్‌ బ్రాంచీకి సీజీఎ్‌సటీ, ఎస్‌జీఎ్‌సటీ లాగా, మిగిలిన రాష్ట్రాల్లోని బ్రాంచీలకు ఐజీఎ్‌సటీ కింద పంపిణీ చేయాలి. ఒకవేళ టర్నోవర్‌ లెక్కించేటప్పుడు ఏదేనీ శాఖకు గత ఆర్థిక సంవత్సరం ఎలాంటి ఆదాయం లేకున్నా లేదా ఆ శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరమే ప్రారంభించి ఉన్నా.. బ్రాంచీల టర్నోవర్‌ కోసం గడచిన ఆర్థిక సంవత్సరం కాకుండా, గడిచిన త్రైమాసికాన్ని తీసుకోవాలి. ఇది ఏ ఒక్క బ్రాంచీకో కాకుండా అన్నీ బ్రాంచీలకు ఇలానే తీసుకోవాలి.


ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, ఏదేనీ ఒక బ్రాంచీకి రిజిస్ట్రేషన్‌ లేకున్నా కామన్‌ క్రెడిట్‌ను పంపిణీ చేయటానికి ఆ బ్రాంచీ టర్నోవర్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే క్రెడిట్‌ పంపిణీ చేసేటప్పుడు అర్హత లేని క్రెడిట్‌ కూడా ఇదే పద్ధతిలో విడిగా చూపుతూ పంపిణీ చేయాలి.

రాంబాబు గొండాల

గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

ఇవి కూడా చదవండి:

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Income Tax Changes: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..

Railway Jobs: రైల్వేలో 9,970 పోస్టులకు నోటిఫికేషన్..అప్లై చేశారా లేదా..

New Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకుంటే మీకే లాభం..

Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 30 , 2025 | 04:19 AM