Home » CS Jawahar Reddy
ఎన్నికల సంఘం అనుమతితో పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనులను చేపట్టాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఉపాధిహామీ, స్వచ్ఛభారత్ అనుసంధానంతో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టాలని కోరారు. ఉపాధి హామీ పనుల్లో వాటర్ కన్జర్వేషన్ పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జవహర్ రెడ్డి సూచించారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ముగిసిన తర్వాత రాష్ట్రంలో పలు ఘర్షణలు, అల్లర్లు నెలకొన్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల కమిషన్ (Central Election Commission) చర్యలు చేపట్టింది. ఈ మేరకు పల్నాడు కలెక్టర్, పలు జిల్లాల ఎస్పీలపై చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు పడింది.
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో చెలరేగిన అల్లర్లు, హింసాత్మక ఘటనలపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘానికి గురువారం వ్యక్తిగత వివరణ ఇచ్చారు. సుమారు అరగంట పాటు సీఎస్, డీజీపీ వివరణ ఇచ్చారు. ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది..
పోస్టల్ బ్యాలెట్ , పోలింగ్ సమయంలో పరీక్షలపై ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) ఫిర్యాదు చేశారు. సోమవారం నాడు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఏపీ విద్యార్థులకు మే 14న పరీక్షలు ఉన్నాయని వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు వారం రోజులు ముందు కీలక పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల సంఘం కింద ప్రభుత్వ అధికారులు పనిచేస్తున్నప్పటికీ.. ప్రభుత్వంలో కీలక అధికారులుగా ఉన్న కొంతమంది వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి ఎన్నికల సంఘానికి టీడీపీ, జనసేన, బీజేపీతో సహా విపక్ష పార్టీలు ఫిర్యాదు చేశాయి. అధికారుల పనితీరుతో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగడంలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో.. రాష్ట్ర డీజీపీ కేవి రాజేంద్రనాథ్ రెడ్డిని(AP DGP Rajendranath Reddy) బదిలీ చేస్తూ జగన్(CM YS Jagan) సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీ పదవి నుంచి ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి(AP CS Jawahar Reddy) ఆదేశించారు.
ఎన్నికల సంఘాన్ని (Election Commission) తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతలు శుక్రవారం కలిశారు. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు ఏపీ పోలీసులపై టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య ఫిర్యాదు చేశారు. పోలీసు వాహనాలను ప్రజా రక్షణకు వాడాలని.. సీఎం జగన్ (CM Jagan) అవినీతి సొమ్ము ఓటర్లు చేరవేయడానికా వాడడం ఏంటని ప్రశ్నించారు.
Andhrapradesh: ఏపీలో పెన్షన్ల కోసం పెన్షన్‌దారులు అష్టకష్టాలు పడుతున్నారు. మండుటెండలో బ్యాంకుల వద్ద పెన్షన్‌దారులు పడిగాపులు కాస్తున్నారు. చాలా అకౌంట్లు ఇన్ఆపరేటివ్ అయి ఉండటంతో.. అకౌంట్లను ఆపరేషన్‌లోకి తెచ్చేందుకు ఆధార్ కార్డు కాపీతో సహా దరఖాస్తు ఇవ్వాలని బ్యాంక్ అధికారులు ఆదేశాలు ఇస్తున్నారు. చదవురాని అనేక మంది పెన్షనర్లు దరఖాస్తులు నింపేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
సామాజిక పింఛన్లను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయలేమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తేల్చేశారు.