Home » Delhi liquor scam
Arvind Kejriwal Arrest: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఈడీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తన ఇంటి నుంచి ఆయన ఈడీ కార్యాలయానికి తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆప్ కార్యకర్తలు అడ్డుకోబోగా.. పోలీసులు వారిని చెదరగొట్టారు.
లిక్కర్ స్కామ్‌లో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. కొత్తగా రూపొందించిన ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయని ఈడీ అధికారులు చెబుతున్నారు. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడాన్ని ఆప్ నేతలు ముక్తకంఠంతో ఖండించారు.
CM Kejriwal: దేశ రాజధాని ఢిల్లీ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఓవైపు సీఎం కేజ్రీవాల్(CM Kejriwal).. మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు(ED).. పరిస్థితి తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో(Delhi Liquor Scam Case) సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేస్తుందని గట్టి ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. కేజ్రీవాల్ కీలక నిర్ణయం..
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈడీ అరెస్టు చేయకుండా నిలిపివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బలవంతపు చర్య (అరెస్ట్)లకు దిగవద్దని ఈడీని ఆదేశించాలని కోర్టును కోరారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడు అభిషేక్ బోయినపల్లికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వైద్య కారణాలతో 5 వారాలు మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. పలు షరతులను కూడా సుప్రీం ధర్మాసనం విధించింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సురేశ్ కుమార్ కైత్, జస్టిస్ మనోజ్ జైన్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) సమన్లను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. తనకు ఇప్పటి వరకూ జారీ చేసిన 9 సమన్లను కేజ్రీవాల్ సవాల్ చేశారు.
న్యూఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నాలుగో రోజు బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈసీ) అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్‌లో కవితను విచారిస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుని విచారిస్తున్న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి నాగ్‌పాల్ బదిలీ అయ్యారు. నాగ్‌పాల్ స్థానంలో న్యాయమూర్తి కావేరీ బవేజా నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టు జ్యుడీషియల్ సర్వీసెస్‌లోని మరో 26 మంది న్యాయమూర్తులు కూడా బదిలీ అయ్యారు.
Telangana: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలో ‘‘మా అమ్మను కలిసేందుకు అనుమతించండి’’ అంటూ న్యాయస్థానాన్ని కవిత అభ్యర్థించారు. తల్లితో పాటు కుమారులను కలుసుకునేందుకు కూడా అనుమతించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టులో కవిత తరపు న్యాయవాదులు మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు.
MLC Kavitha Arrest: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) చిక్కులు తప్పేలా లేవు. సుప్రీంకోర్టు తీర్పుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కవితకు చుక్కెదరయ్యే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి..