Delhi Liquor Scam: అభిషేక్ బోయినపల్లికి బెయిల్..
ABN , Publish Date - Mar 20 , 2024 | 12:25 PM
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడు అభిషేక్ బోయినపల్లికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వైద్య కారణాలతో 5 వారాలు మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. పలు షరతులను కూడా సుప్రీం ధర్మాసనం విధించింది.
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam)లో నిందితుడు, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లి (Abhishek Boinapally)కి సుప్రీంకోర్టు (Supreme Court)బెయిల్ మంజూరు చేసింది. వైద్య కారణాలతో 5 వారాలు మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. పలు షరతులను కూడా సుప్రీం ధర్మాసనం విధించింది. ట్రయల్ కోర్టు అనుమతితోనే హైదరాబాద్ (Hyderabad) కు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. పాస్‌పోర్టు (Passport) సరెండర్ చేయాలని కూడా అభిషేక్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది.
Hyderabad: వామ్మో.. పెద్దప్రమాదమే తప్పిందిగా.. పెట్రోల్‌బంక్‌లో ఉండగా కారులో మంటలు..
ఎప్పుడెప్పుడు.. ఏం జరిగిందంటే..
లిక్కర్ స్కామ్‌పై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా విచారణకు ఆదేశించడంతో 2022 ఆగస్టు 17న సీబీఐ ఎఫ్‌ఐ ఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత నాలుగు రోజులకు ఆగస్టు 22న ఈడీ ఈసీఐర్ దాఖలు చేసింది. అదే ఏడాది నవంబరు 25న తొలి చార్జిషీటు దాఖలైంది. 2021 జూన్‌లో హైదరాబాద్‌కు చెందిన కొందరు వ్యాపారులు, రాజకీయ నాయకులు సౌత్ గ్రూప్ పేరుతో ఢిల్లీ రాజకీయ నేతలతో లావాదేవీలు జరిపారని అందులో పేర్కొంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తరఫున విజయ్ నాయర్ మొత్తం వ్యవహారాన్ని నిర్వహించారని వెల్లడించింది.
సీబీఐ చార్జిషీటు ప్రకారం దొడ్డిదారిన అక్రమార్జన కోసమే ఢిల్లీ మద్యం విధానాన్ని రూపొందించారు. హోల్‌సేల్‌గా 12 శాతం లాభాలు, రిటైల్‌గా 185శాతం లాభాలు ఆర్జించాలని ప్రణాళికలు రచించారు. ఢిల్లీలో హోల్‌సేల్ వ్యాపార సంస్థ అయిన ఇండో స్పిరిట్ గ్రూప్‌నకు 65శాతం వాటా కేటాయించేందుకు అంగీకరించారు. ఇందులో సౌత్ గ్రూప్‌నకు ప్రత్యక్షంగా, పరోక్షంగా 9 రిటైల్ జోన్లను కేటాయించారు.
2021 జనవరిలో హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్‌లో కవిత బినామీగా భావిస్తున్న అరుణ్ రామచంద్ర పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు తదితరులు విజయ్ నాయర్‌తో సమావేశమయ్యారు.
కవితతోపాటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, శరత్ రెడ్డి ఉండగా.. వారికి అరుణ్ పిళ్లై, బుచ్చిబాబు, అభిషేక్.. సౌత్ గ్రూప్ ప్రతినిధులుగా వ్యవహరించారు. 2021 జూలై-సెప్టెంబరు మధ్య రూ.30కోట్లు హవాలా మార్గం ద్వారా మళ్లించారు.
2021 సెప్టెంబరు 20న ఢిల్లీలో మద్యం ఉత్పత్తిదారు ఫెర్నార్డ్ ఇచ్చిన విందుకు అభిషేక్, అరుణ్ పిళ్లై, శరత్ చంద్రారెడ్డి హాజరయ్యారు. 2022 ఏప్రిల్ 8న కవిత, అరుణ్ పిళ్లై కలిసి ఢిల్లీలోని ఓబెరాయ్ హోటల్‌లో విజయ్ నాయర్, దినేశ్ అరోరాను కలిసి తమకు రావాల్సిన ముడుపుల గురించి చర్చించారు.
2022 సెప్టెంబరు నుంచీ అరెస్టులు మొద లయ్యాయి. మొదట ఇండో స్పిరిట్ యజమాని సమీర్ మహేంద్రు, నవంబరులో శరత్‌చంద్రారెడ్డి, బినయ్ బాబు, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా అరెస్టయ్యారు.
2023 ఫిబ్రవరి 26న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. 2023 జూన్‌లో శరత్ చంద్రారెడ్డి, సెప్టెంబరులో మాగుంట రాఘవరెడ్డి, దినేశ్ అరోరా... అప్రూవర్లుగా మారారు. తాజాగా కవిత అరెస్ట్ అయ్యారు. ఇక ఇప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చుట్టూ ఈడీ ఉచ్చు బిగిస్తోంది.
Secunderabad: ఉదయం బీజేపీ అభ్యర్థి ప్రచారంలో.. మధ్యాహ్నం కాంగ్రెస్‌లోకి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.