Home » Donald Trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అన్నంత పని చేశాడు. టారిఫ్ పెంపు, ప్రతీకార సుంకాల విధింపుతో వాణిజ్య యుద్ధానికి తెర తీశాడు. ట్రంప్ విధించిన సుంకాల వల్ల విదేశాల మీద ఎంత ప్రభావం ఉంటుందో తెలియదు కానీ.. అమెరికన్ల మీద మాత్రం భారీగా ప్రభావం పడనుంది అంటున్నారు నిపుణులు. తాజా సుంకాల వల్ల కొన్నింటి ధరలు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రతీకార సుంకాలు విధించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తన నిర్ణయంతో అమెరికా సుసంపన్నమవుతుందని.. మళ్లీ పూర్వ వైభవం వస్తుందని తెలిపారు. అలానే భారత్ తమకు మిత్రుడే కానీ.. సుంకాల విషయంలో ఆ దేశం వైఖరి సరిగా లేదని ట్రంప్ ఆరోపించాడు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాల విధింపుపై కీలక ప్రకటన చేయనున్న నేపథ్యంలో దేశాలు రంగాలవారీగా ప్రత్యేక సుంకాలు విధించనున్నట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి భారతదేశంపై వీటి ప్రభావాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలను విధించనున్నట్లు ప్రకటించారు. భారత్, జపాన్, కెనడా, ఈయూ వంటి దేశాలపై భారీ సుంకాలు విధిస్తామని ఆయన పేర్కొన్నారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2 నుంచి అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. భారత్ ఎగుమతులపై ఈ నిర్ణయం ప్రభావం చూపించగలదు
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ట్రంప్ ఇచ్చిన బాంబు హెచ్చరికకు ఘాటు ప్రత్యుత్తరం ఇచ్చారు. అమెరికా వైమానిక దాడులపై తీవ్ర ప్రతిస్పందనకు సన్నద్ధమయ్యామని తెలిపారు
డొనాల్ట్ ట్రంప్ వైమానిక దాడులు చేస్తామంటూ హెచ్చరించడంతో అప్రమత్తమైన ఇరాన్ తన మిస్సైళ్లను రెడీ చేసుకుంది. ప్రపంచవ్యా్ప్తంగా అమెరికా స్థావరాలను టార్గెట్ చేసేలా క్షిపణులను ఇరాన్ సిద్ధం చేసుకున్నట్టు టెహ్రాన్ టైమ్స్ అనే పత్రిక పేర్కొంది.
ట్రంప్ ఇరాన్ పై కొత్త అణు ఒప్పందానికి ఒప్పుకోకపోతే బాంబులు పడతాయని హెచ్చరించారు. ఇరాన్ అధ్యక్షుడు ప్రత్యక్ష చర్చలకు నిరాకరించడంతో, ట్రంప్ 2 నెలల్లో ఒప్పందం కుదుర్చుకోవాలని అంగీకరించారు
ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రశంసలు కురిపించారు. మోదీని గొప్ప మిత్రుడు, చాలా తెలివైన వ్యక్తి అని పేర్కొన్న ట్రంప్ భారత్‌పై అధిక సుంకాలు విధించడాన్ని సమర్థించారు
పునర్వ్యవస్థీకరణలో భాగంగా అమెరికాలోని ఆరోగ్య, మానవ సేవల విభాగంలో 10వేల మంది ఉద్యోగులను తొలగించాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని గురువారం ప్రకటించింది.