Share News

Trump: అమెరికా ఆరోగ్య శాఖలో 10వేల మంది ఉద్యోగులపై వేటు !

ABN , Publish Date - Mar 28 , 2025 | 05:45 AM

పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా అమెరికాలోని ఆరోగ్య, మానవ సేవల విభాగంలో 10వేల మంది ఉద్యోగులను తొలగించాలని ట్రంప్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని గురువారం ప్రకటించింది.

Trump: అమెరికా ఆరోగ్య శాఖలో 10వేల మంది ఉద్యోగులపై వేటు !

వాషింగ్టన్‌, మార్చి 27: పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా అమెరికాలోని ఆరోగ్య, మానవ సేవల విభాగంలో 10వేల మంది ఉద్యోగులను తొలగించాలని ట్రంప్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని గురువారం ప్రకటించింది. అంటు వ్యాధుల నివారణ; ఆహారం, ఆస్పత్రుల తనిఖీ, ఆరోగ్య బీమా వంటి విధులను ఈ విభాగమే నిర్వహిస్తుంది. ప్రస్తుతం దీంట్లో 82వేల మంది ఉద్యోగులు ఉండగా, దాన్ని 62వేలకు తగ్గించాలని నిర్ణయించింది. లేఆ్‌ఫలు, స్వచ్ఛంద, ముందస్తు పదవీ విరమణలు, ఇతర మార్గాల్లో ఉద్యోగులను తొలగించనుంది. లేఆ్‌ఫల ద్వారా 10వేల మందిని, ఇతర మార్గాల ద్వారా మరో పది వేల మందిని తీసేయనుంది. అందులో భాగంగా తొలుత పది వేల మందిని తొలగించడానికి ఏర్పాట్లు చేస్తోంది.

Updated Date - Mar 28 , 2025 | 05:45 AM