Home » Education News
గ్రేస్ మార్కులు ఇచ్చిన 1563 మందికి జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆదివారం మళ్లీ నీట్ పరీక్ష నిర్వహిస్తే.. వారిలో 813 (52 శాతం) మందే హాజరయ్యారు. మిగతా 750 మందీ డుమ్మా కొట్టేశారు.
కేంద్ర ప్రభుత్వ తీరును కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఈ రోజు జరగాల్సిన నీట్ పీజీ పరీక్ష వాయిదా వేయడంపై మండిపడింది. పేపర్ లీక్ అవుతోన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని ధ్వజమెత్తింది. విద్యార్థుల భవిష్యత్‌కు బీజేపీ ప్రభుత్వ విధానాలు శాపంగా మారాయని విరుచుకుపడింది.
దేశంలో జరుగుతున్న పోటీ పరీక్షల నీట్, యూజీసీ-నెట్లలో(NEET UG 2024) అవకతవకలు జరిగాయన్న వివాదం ఆగేలా కనిపించడం లేదు. ఒకవైపు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్‌ను శనివారం ఆ పదవి నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఈ నేపథ్యంలో మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నీట్ పరీక్షను కూడా రద్దు చేస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రెండు వారాలకు పైగా దేశవ్యాప్తంగా విద్యార్థులు జరుపుతున్న పోరాటం, జాతీయ స్థాయిలో బలపడిన విపక్షం ఒత్తిడి ఫలించాయి. జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన నీట్-యూజీ, యూజీసీ-నెట్ ప్రవేశ పరీక్షల లీక్ ...
కేంద్ర ప్రభుత్వం పేపర్ లీక్ చట్టాన్ని అమల్లోకి తేవడం కంటితుడుపు చర్య అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కీలకంగా వ్యవహరించిన రవి అత్రిని ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్(ఎ్‌సటీఎఫ్) పోలీసులు శనివారం అరెస్టు చేశారు. లీకేజీ కుట్రదారు సంజీవ్ ముఖియాకు అత్రి సన్నిహితుడు.
అటు నియామక పరీక్ష కానీ.. ఇటు బోర్డు పరీక్ష కానీ..! నెట్ వంటి ప్రామాణిక పరీక్ష కానీ..! నీట్ వంటి కీలకమైన పరీక్ష కానీ..! రాజస్థాన్ నుంచి తమిళనాడు వరకు..
యూజీసీ-నెట్ ప్రశ్నపత్రాల లీకేజీలో భాగస్వాములైన చానెళ్లపై కఠిన చర్యలు తీసుకున్నట్లు టెలిగ్రాం సంస్థ తెలిపింది. ‘‘పరీక్ష ప్రశ్నపత్రాలను సర్క్యులేట్ చేసిన అన్ని చానెళ్లను నిషేధించాం
‘నీట్’ పరీక్ష నిర్వహణలో అడుగడుగునా లోపాలున్నాయని థర్డ్ పార్టీ రివ్యూలో తేలింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 4 వేల కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఇంటికి, అమ్మానాన్నకు దూరంగా హాస్టల్లో ఉంటూ చదువుకోవడం ఆ బాలుడికి చాలా భయంకరంగా అనిపించింది. తన కష్టాన్ని అమ్మకు చెబితే.. కొడుకు భవిష్యత్తు కోసం ఆ తల్లి నచ్చజెప్పింది. కానీ, హాస్టల్లో ఉండే దైర్యం చేయలేకపోయిన ఆ బాలుడు అక్కడి నుంచి పారిపోయేందుకు సాహసించి ప్రాణాలు కోల్పోయాడు.