Home » Election Campaign
నా మైనార్టీలు అంటూ వైసీపీ ప్రభు త్వం వారిని మోసం చేసిందని మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ పేర్కొన్నారు. ఆయన ఆదివారం చిలమ త్తూరులో ఆయన పర్యటించి ముస్లిం మైనార్టీలను టీడీపీకి ఓటు వేయాలని అభ్యర్థిం చారు. చిలమత్తూరులో టీడీపీ నాయకులు నాగరాజుయాదవ్, లక్ష్మీనారాయణ యా దవ్, దేమకేతేపల్లి అంజినప్ప, రంగారెడ్డి, సోమశేఖర్, బయపరెడ్డి, బాలాజీ, చంద్ర మోహన, మాజీ ఎంపీటీసీ సూర్యనారాయణ, టేకులోడు బయపరెడ్డి తదితరలు మైనార్టీ నాయకులతో సమావేశాన్ని ఏర్పాటుచేశారు.
అభివృద్ధికి పాటుపడే టీడీపీకి ఓటువేసి కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డిని గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి కుమారుడు విరాజ్‌రెడ్డి ప్రజలను అభ్యర్థించారు. పట్టణంలోని రజకవీధిలో ఆదివారం ఇంటింటికి తిరిగి ప్రజలను టీడీపీకి ఓట్లు వేయాలని కోరారు.
సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లోకి సూపర్‌స్పీడ్‌తో దూసుకెళ్తున్నాయని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. మండలంలోని బూదగవి, నెరమెట్ల, వ్యాసాపురం, రాయంపల్లి, రేణుమాకులపల్లి, నింబగల్లు గ్రామాల్లో ఆదివారం ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
వైసీపీకి ఓటేసి ఒక్క ఛాన్స ఇవ్వడంతో రాష్ట్రం అధోగతి పట్టిందని, మళ్లీ వైసీపీకి ఓటేస్తే సర్వనాశనం అవుతుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత అన్నారు. టీడీపీ సంక్షేమం, అభివృద్ధి జరిగాయన్నారు. ఆమె ఆదివారం మండలంలోని గొందిపల్లి, దుద్దేబండ, చంద్రగిరి, గొల్లపల్లి, గోనిపేట, రాంపురం, గ్రామాల్లో భారీ జనసందోహం మధ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ గ్రామాల్లో గజమాలలు, పూలు, హారతులతో మహిళలు ఆమెను ఆశీర్వదించారు. ఆమె టీడీపీ సూపర్‌సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తల్లికి వందనం పేరుతో ఎంతమంది చదివే పిల్లలుంటే వారందరికి ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇస్తామని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం కురవళ్లి, చంద్రగిరి, సిద్ధరాంపురం, నేమకల్లు, హరేసముద్రం, ఉంతకల్లు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో నిర్వహించారు.
అభివృద్ధిలో చంద్రబాబుకు, జగనకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని టీడీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి విమ ర్శించారు. చంద్రబాబు అభివృద్ధి సా ధకుడని, జగన నిరోధకుడ న్నారు. ఆయన ఆదివారం మండలంలోని గొందిపల్లిలో కూటమి ఎమ్మెల్యే అ భ్యర్థి సవితతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి టీడీపీ సూపర్‌సిక్స్ పథ కాలను వివరించారు.
చీకటి రాజ్యం నుంచి ప్రజలు వెలుగులోకి రావాలని టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. మండలంలోని అపిలేపల్లి, జానంపల్లి, యర్రగుంట, అల్లాపురం, బసాపురం, మాయదారులపల్లి, వడ్డీపాల్యం తదితర గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన అమిలినేనికి నాయకులు, మహిళలు, గ్రామస్థులు పూలవర్షం కురిపించి గజమాలతో ఘన స్వాగతం పలికారు.
రామ రాజ్యం రావాలంటే టీడీపీకి ఓటు వేయాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు పేర్కొ న్నారు. అగళి మండలం పీ బ్యాడిగెర, హెచడీ హళ్లి, ఇరిగేపల్లి, ఆర్జీపల్లి, కోడిపల్లి, రామనపల్లి పంచాయతీ కేంద్రాల్లో ఆదివారం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గుండుమల మాట్లాడుతూ రాష్ట్రంలో సైకో ప్రభుత్వం పోవాలి, రామరా జ్యం రావాలంటే సైకిల్ గుర్తుకు ఓటేయాలన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటినను మూసేసి, పేదల నోటికాడ భోజనం లాగేసుకున్నారని నందమూరి బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధరాదేవి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఆదివారం స్థానిక కొల్లకుంట ఆంజనేయస్వామి ఆలయంలో పూజల అనంతరం ఒకటి నుంచి ఆరో వార్డు వరకు పర్యటించారు. ఈ సందర్భంగా కొల్లకుంటలో ఆమె మాట్లాడుతూ... వైసీపీ ఐదేళ్లకాలంలో అన్నింటినీ రద్దుచేసింది తప్ప ప్రజలకు మేలు చేసే ఏ ఒక్క పథకం తీసుకురాలేదన్నారు.
విశాఖ: పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన ఏమి లాయర్?... ఆయన ప్రెస్ మీట్ పెట్టీ భుజాలు తడుముకున్నారని.. ఆయిన తనపై ఊగుతూ మాట్లాడారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఆదివారం విశాఖలో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.