Home » Errabelli Dayakar Rao
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు పాలకుర్తి మండల కేంద్రం రాజీవ్ చౌరస్తాలో ఎండిన పంటలకు మద్దతుగా రైతుల మహా ధర్నాలో ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. అవేంటంటే.. బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మారుస్తామని ప్రకటించారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యంత్రి కేసీఆర్ చేపట్టిన పర్యటనపై కాంగ్రెస్ ( Congress ) నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కేసీఆర్ తీహార్ జైలులో ఉన్న కవితను పరామర్శిస్తే బాగుండేదని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తనపై ఫిర్యాదు, ఆరోపణలు చేసిన శరణ్ చౌదరి ఎవరో తనకు తెలియదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. నేడు ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ.. భూదందాలు, కబ్జాలు చేస్తున్నారని బీజేపీ నుంచి శరణ్ చౌదరిని తొలగించినట్లు.. నకిలీ పత్రాలతో ప్రవాసుల నుంచి డబ్బులు తీసుకొని మోసం చేసినట్లు తెలిసిందన్నారు. శరణ్ చౌదరిపై ఎన్నో కేసులు ఉన్నాయని.. అటువంటి వ్యక్తిని ప్రోత్సహించవద్దన్నారు
తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న ప్రచారానాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. తనకు పార్టీ మారే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తాజాగా సొంత పార్టీపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలేంటో చెప్పారు. దళిత బందు, గిరిజన బంధు, డబుల్ బెడ్రూం ఇళ్లు సక్రమంగా ఇవ్వకపోవడం వల్లే.. బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయిందని పేర్కొన్నారు.
మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే సభకు తగిన ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీసీ నాయకుడు మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్యను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అవమానించారని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు(Minister Errabelli Dayakara Rao) అన్నారు.
ఇకపై జనగామలో వర్గాలు ఉండొద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Minister Errabelli Dayakar Rao) ఆదేశించారు.
ఎన్టీఆర్, కేసీఆర్ అభివృద్ధి ప్రదాతలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Minister Errabelli Dayakar Rao) వ్యాఖ్యానించారు.
గాంధీజీ స్ఫూర్తితో తెలంగాణ తెచ్చిన గాంధీ కేసీఆర్ అని.. ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.