Share News

Minister Errabell: పొన్నాలపై రేవంత్‌రెడ్డి మాటలను ఖండిస్తున్నా

ABN , First Publish Date - 2023-10-14T20:31:59+05:30 IST

బీసీ నాయకుడు మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్యను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అవమానించారని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు(Minister Errabelli Dayakara Rao) అన్నారు.

Minister Errabell: పొన్నాలపై రేవంత్‌రెడ్డి మాటలను ఖండిస్తున్నా

జనగామ: బీసీ నాయకుడు మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్యను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అవమానించారని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు(Minister Errabelli Dayakara Rao) అన్నారు. శనివారం నాడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ 40ఏళ్లుగా పార్టీని పట్టుకుని ఉన్న పొన్నాలను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి నీచంగా మాట్లాడారు. దందాలు చేసే బ్రోకర్ సీనియర్ లీడర్‌పై అలా మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం. కాంగ్రెస్‌లో టికెట్లు అమ్ముకుంటున్నారు. ఎల్లుండి జనగామలో జరిగే సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు.

Updated Date - 2023-10-14T20:31:59+05:30 IST