Home » Jeevan Reddy
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక.. కాంగ్రె్‌సలో కలకలానికి కారణమైంది. తనకు సమాచారం ఇవ్వకుండా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ని, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివా్‌సరెడ్డిని పార్టీలో చేర్చుకోవడం పట్ల మనస్తాపం చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి..
జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై అలకబూని.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రకటన చేసిన హస్తం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ టీ.జీవన్‌రెడ్డిని బుజ్జగించేందుకు ఏఐసీసీ బంపరాఫర్ ఇచ్చింది.
హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ ఫోన్ చేశారు. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా కోరినట్లు సమాచారం. హైదరాబాద్ వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుతామని మున్షీ చెప్పినట్లు సమాచారం.
బీఆర్ఎస్ నేత, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌ను కాంగ్రె్‌సలో చేర్చు కోవడంపై సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి కినుక వహించారు. తీవ్ర అసంతృప్తికి గురై రాజీనామాకు సిద్ధమయ్యారు.
జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ విషయం స్థానిక నేత జీవన్ రెడ్డికి (Jeevan Reddy) కనీస సమాచారాన్ని అధిష్ఠానం ఇవ్వకపోవడంతో ఆయన వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయింది.
బీఆర్ఎస్ పార్టీ నేతల చేరికలతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. జగిత్యాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత సంజయ్ కుమార్ ఆదివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం పెద్ద ఎత్తున రచ్చకు కారణమవుతోంది. సంజయ్ చేరికపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళనలకు దిగాయి. అధిష్టానంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఆయనను ప్రభుత్వ విప్పులు ఆది శ్రీనివాస్, లక్ష్మణ్ బుజ్జగిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బాన్స్ వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరికతో నేతల క్యూ మొదలైంది. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పు కున్నారు. తనకు తెలియకుండానే సంజయ్ కుమార్‌ను పార్టీలో ఎలా చేర్చుకుంటారని సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు.
విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అసెంబ్లీలో కోరినట్లుగానే న్యాయ విచారణ కమిషన్‌ను వేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. స్వతంత్ర వ్యవస్థగా విచారణ చేస్తున్నందు వల్ల అందులో ఎవరి జోక్యం ఉండదని తెలిపారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తర, దక్షిణ తెలంగాణ అని కొత్త నాటకానికి తెర తీస్తున్నారని మండిపడ్డారు. రామగుండంలో కాదని దామర చర్లలో విద్యుత్ ప్లాంట్ పెడతారా...? అని ధ్వజమెత్తారు. అక్కడ నెలకొల్పడంతో బొగ్గు తరలింపు ఆర్థిక భారం కాదా అని నిలదీశారు.