Share News

Palla Srinivas Rao: రెడ్‌బుక్‌లో విజయసాయి పేరుందా.. సంచలన విషయాలు బయటపెట్టిన టీడీపీ

ABN , Publish Date - Jan 27 , 2025 | 04:02 PM

Palla Srinivas Rao:జగన్ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు పారిపోయేలా చేశారని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌రావు ఆరోపించారు. వైసీపీ నేతలు రెడ్‌బుక్ చూస్తుంటే భయపడుతున్నారని అన్నారు. తప్పుచేసిన వైసీపీ నేతలను, అధికారులను వదలబోమని పల్లా శ్రీనివాస్‌రావు హెచ్చరించారు.

Palla Srinivas Rao: రెడ్‌బుక్‌లో విజయసాయి పేరుందా.. సంచలన విషయాలు బయటపెట్టిన టీడీపీ
Palla Srinivas Rao

విశాఖపట్నం: మాజీ ఎంపీ విజయసారెడ్డికి టీడీపీ నేతలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. నారా లోకేష్ రెడ్‌బుక్‌లో (Nara Lokesh Red Book) వైసీపీ హయాంలో తప్పుచేసిన నేతలు, అధికారులను వదిలిపెట్టబోమని టీడీపీ నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. తాజాగా విజయసారెడ్డిపై (Vijayasai Reddy) తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌రావు (Palla Srinivasa Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయకుండానే విజయసారెడ్డి రాజీనామా చేశారని విమర్శించారు. రాజీనామా చేసినా విజయసాయిని వదిలిపెట్టబోమని.. రెడ్‌బుక్ పని ఆగదని పల్లా శ్రీనివాస్ హెచ్చరించారు.


వైసీపీ (YSRCP) హయాంలో అందరిని ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు పారిపోయేలా చేశారని ఆరోపించారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి ఏపీకి అన్యాయం చేశారని విమర్శలు చేశారు. పబ్లిక్ సెక్టార్‌లను ముంచేయాలని జగన్ చూశారని పల్లా శ్రీనివాస్‌రావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా చంద్రబాబు కృషి చేస్తున్నారని పల్లా శ్రీనివాస్‌రావు అన్నారు. చంద్రబాబు అంటే ఓ బ్రాండ్ అని ఉద్ఘాటించారు. దావోస్‌లో అగ్రిమెంట్లు అవ్వవు, అది చర్చా వేదిక అని చెప్పారు. రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి దావోస్ చాలా ఉపయోగపడుతుందని వివరించారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టేలా చంద్రబాబు కృషి చేశారని పల్లా శ్రీనివాస్‌రావు అన్నారు.


దావోస్‌‌లో చంద్రబాబు పెద్దన్న పాత్ర: ఎంపీ శ్రీభరత్

sri bharat.jpg

వైసీపీ ప్రభుత్వంలో సీఎం ఎవ్వరికీ అందుబాటులో ఉండేవారు కాదని.. ఇప్పుడు సీఎం చంద్రబాబు పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉన్నారని ఎంపీ శ్రీభరత్ తెలిపారు. దావోస్‌‌లో చంద్రబాబు పెద్దన్న పాత్ర పోషించారని ఉద్ఘాటించారు. సీఎం చంద్రబాబు రాష్ట్రానికే కాకుండా దేశం గురుంచి మాట్లాడటం సంతోషించదగ్గ విషయమని చెప్పారు. దావోస్ ఫలాలు తప్పనిసరిగా ఏపీకి అందుతాయని తెలిపారు. యువగళం ద్వారా మంత్రి నారా లోకేష్ ప్రజల్లోకి వెళ్లారని చెప్పారు. ప్రజా సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకున్నారని అన్నారు. మంగళగిరిలో ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు లోకేష్ మరింత చేరువయ్యారని చెప్పుకొచ్చారు. తాము కూడా లోకేష్‌ను స్పూర్తిగా తీసుకుని ప్రజా దర్బార్ నిర్వహిస్తామని ఎంపీ శ్రీభరత్ తెలిపారు.


యువగళంతో ప్రత్యర్థుల గుండెల్లో పిడుగులు: ప్రణవ్ గోపాల్

pranav-gopal.jpg

విశాఖపట్నం: నాటి యువ గళం అడుగులే, నేడు ప్రజాగళంగా మారి ప్రత్యర్థుల గుండెల్లో పిడుగులై పడ్డాయని వీఎంఆర్డీఏ చైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్ తెలిపారు. యువ నేత నారా లోకేష్ పాదయాత్ర వైసీపీ పాలిట దండయాత్రగా మారి 11 సీట్లకు పరిమితం చేశాయని విమర్శించారు. యువగళం పాదయాత్ర చేపట్టి రెండేళ్లు పూర్తి అయినా సందర్భంగా నారా లోకేష్‌కు ప్రణవ్ గోపాల్ శుభాకాంక్షలు తెలిపారు.


యువగళం చరిత్ర గతినే తిరగరాసింది: గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు

yarapatineni-srinivas.jpg

పల్నాడు జిల్లా: యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర రాష్ట్ర చరిత్ర గతినే తిరగరాసిందని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. యువగళం 3132 కి.మీ. మేర పాదయాత్ర పూర్తి చేసి వైసీపీకు సమాధిరాళ్లు పాతుకుంటూ వచ్చారని విమర్శించారు. లోకేష్ పాదయాత్ర చేయకపోయుంటే రాక్షస జగన్ రాష్ట్రాన్ని కబలించేవాడని ఆక్షేపించారు. యువగళం ద్వారా టీడీపీకి , ప్రజాస్వామ్యానికి కొత్తఊపిరి పోశారని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Rammohan Naidu: రామ్మోహన్‌నాయుడికి అవమానం.. గుంటూరు పర్యటనలో మనసులో మాట బయటపెట్టిన కేంద్రమంత్రి

Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: నువ్వు మరిన్ని రికార్డులు నెలకొల్పాలి.. దేవాన్ష్‌కు పవన్ అభినందనలు

Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 27 , 2025 | 04:06 PM