Home » Narendra Modi
పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగం 75 సంవత్సరాల ప్రయాణం గురించి గుర్తుచేశారు. దీంతోపాటు మరికొన్ని విషయాలను కూడా ప్రస్తావించారు.
గత రికార్డులను మహారాష్ట్ర బద్ధలు కొట్టిందని, గత 50 ఏళ్లలో ఏ పార్టీ కానీ, ఎన్నికల ముందు పొత్తులుపెట్టుకున్న కూటములు కానీ సాధించని అతిపెద్ద విజయం ఈసారి నమోదైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన 'మహాయుతి కూటమి'కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇది అభివృద్ధికి, సుపరిపాలనకు ప్రజలు అందించిన విజయమని అభివర్ణించారు.
రాష్ట్రంలో 2026లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi), హోం మంత్రి అమిత్షా(Amit Shah) రూపొందించబోయే కొత్త వ్యూహరచనతో పాలనలో మార్పు తథ్యమని, బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని బీజేపీ జాతీయ కార్యాచరణ కమిటీ సభ్యురాలు, నటి ఖుష్బూ పేర్కొన్నారు.
ఇంటెలిజెన్స్ బ్యూరో నిర్వహించే వార్షిక సదస్సులో మొదటిసారిగా బాంబు బెదిరింపుల అంశంపై చర్చించనున్నారు. వచ్చే వారం జరగనున్న ఈ బేటీకి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా అన్ని రాష్ట్రాల అధికారులు హాజరుకానున్నారు.
నైజీరియాలో తొలి పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం (నవంబర్ 18న) బ్రెజిల్ చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడ జరిగే జీ-20 సదస్సులో పాల్గొననున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
నైజీరియాలో ఉంటూ ఆఫ్రికా దేశాల్లో భారతీయ సంస్కృతి పరిరక్షణకు పాటు పడుతున్న తెలంగాణ ప్రవాసిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.
ఆదివారం ఉదయం అధ్యక్షుడి ప్రాసాదంలో నైజీరియా అధ్యక్షుడు బొలా అహ్మద్ టినుబు ను మోదీ కలుసుకున్నారు. తనకు దేశ అత్యున్నత పురస్కారం అందజేసినందుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇది భారతదేశానికి, శతాబ్దాలుగా ఇండియా-నైజీరియా మధ్య కొనసాగుతున్న బంధానికి దక్కిన గౌరవంగా అభివర్ణించారు.
'ది సబర్మతి రిపోర్ట్' సినిమాను గుజరాత్లో 2002లో జరిగిన అల్లర్లు, గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందించారు. 2002 ఫిబ్రవరి 27న గోద్రా స్టేషన్ సమీపంలో సబర్మతి ఎక్స్ప్రెస్ ఎస్-6 కోచ్కు కొందరు దుండగులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో 59 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు.
పశ్చిమాఫ్రికా ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా పర్యటించారు. ఈ పర్యటన నేపథ్యంలో అక్కడి ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.