Share News

Srinagar Vande Bharat: 19 నుంచి శ్రీనగర్‌కు వందేభారత్‌ రైలు

ABN , Publish Date - Apr 01 , 2025 | 03:48 AM

జమ్మూ-కట్రా-శ్రీనగర్ మధ్య వందే భారత్ రైలు సేవలు ఏప్రిల్ 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టులో 38 సొరంగాలు, 927 బ్రిడ్జిలు, మరియు చీనాబ్ రైల్వే ఆర్చి బ్రిడ్జి ఉండడం విశేషం

Srinagar Vande Bharat: 19 నుంచి శ్రీనగర్‌కు వందేభారత్‌ రైలు

న్యూఢిల్లీ, మార్చి 31:శ్మీర్‌లోయలో పొడవైన సొరంగాలు, ఎత్తయిన బ్రిడ్జిలు, సొగసైన ప్రకృతి అందాల మధ్య రయ్‌..మని దూసుకుపోవడానికి వందే భారత్‌ రైళ్లు సిద్ధమవుతున్నాయి. కశ్మీర్‌ను నేరుగా దేశంలోని ఇతర రైల్వే లైన్లతో కలపడానికి రెడీ అవుతున్నాయి. ఉధంపూర్‌-కశ్మీర్‌-బారాముల్లా మధ్య 272 కి.మీ. రైల్‌ లింక్‌ ప్రాజెక్టు పూర్తయిన నేపథ్యంలో జమ్మూ-కట్రా-శ్రీనగర్‌ మధ్య వందే భారత్‌ రైలును నడపాలని నిర్ణయించారు. ఈనెల 19న ప్రధాని మోదీ కాట్రాలో ఆ రైలును ప్రారంభించనున్నారు. ప్రస్తుతం జమ్మూ స్టేషన్‌ను ఆధునీకరిస్తున్న కారణంగా తొలుత కట్రా నుంచి ఈ రైలు సేవలు మొదలుకానున్నాయి. వందే భారత్‌ ప్రారంభమైతే కశ్మీర్‌కు నేరుగా రైలును నడపాలన్న డిమాండ్‌ను నెరవేర్చినట్లు అవుతుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో 119 కి.మీ. పొడవైన మొత్తం 38 సొరంగాలు ఉండగా, అందులో 12.75 కి.మీ. పొడవుండే టి-49 అనే సొరంగం దేశంలోనే అత్యంత పొడవైనదని తెలిపారు. అలాగే ఈ ప్రాజెక్టులో 927 బ్రిడ్జిలు ఉండగా.. వీటి మొత్తం పొడవు 13 కి.మీ.లు అని అధికారులు చెప్పారు. వీటిలో ప్రపంచంలోనే ఎత్తయిన చీనాబ్‌ రైల్వే ఆర్చి బ్రిడ్జి కూడా ఉందని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Ranya Rao: వెలుగులోకి సంచలన విషయాలు..

Also Read: తొక్కే కదా అని పారేస్తున్నారా.. దీనిలోని పోషకాలు తెలిస్తే.. ఆశ్చర్యపోతారు..

Sanjay Raut: మోదీ ఆ ప్లాన్‌తోనే ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లారేమో..

వాట్సాప్‌లో కాదు.. పుస్తకాలు చదివి చరిత్ర తెలుసుకొండి: రాజ్‌ఠాక్రే

Monalisa Director: మోనాలిసా డైరెక్టర్‌పై కేసు.. అత్యాచారం, ఆపై అసభ్య వీడియోలతో వేధింపులు

For National News And Telugu News

Updated Date - Apr 01 , 2025 | 03:48 AM