Home » Parliament Special Session
రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారంనాడు లోక్‌సభలో సమాధానమిస్తుండగా సభలో గలభా చోటుచేసుకుంది. దీంతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మందలించారు.
పార్లమెంటులో ఈవీఎంల అంశం మరోసారి ప్రస్తావనకు వచ్చింది. ఈవీఎంల విశ్వసనీయతను సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, కన్నౌజ్ ఎంపీ అఖిలేష్ యాదవ్ లోక్‌సభలో మంగళవారం ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ 80 సీట్లు గెలిచినా సరే తాను ఈవీఎంలను నమ్మేది లేదని అన్నారు.
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మధ్య వాడివేడి సంభాషణ జరిగిన రెండ్రోజులకే వారి మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది. దీంతో సభలో నవ్వులు వెల్లివిరిసాయి.
పద్దెనిమిదో లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. 48 ఏళ్ల తర్వాత మళ్లీ లోక్‌సభ సభాధ్యక్ష పదవికి ఎన్నిక జరగ్గా.. ఓం బిర్లా మూజువాణి ఓటుతో విజయం సాధించారు.
పార్లమెంట్ స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) విప్ జారీ చేసింది. పార్టీకి చెందిన 16 మంది లోక్‌సభ సభ్యులకు త్రీ లైన్ విప్ జారీ చేసింది. రేపు లోక్‌సభకు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ చీఫ్ విప్ జీఎం హరీష్ బాలయోగి (GM Harish Balayogi) పేర్కొన్నారు.
పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఇండియా కూటమికి చెందిన మహిళా ఎంపీలు ఇలా ఓ ఫొటోకు పోజిచ్చారు.
పార్లమెంట్ కొత్త భవనంలో 18వ లోక్‌సభ కొలువుదీరింది. ఈ భవనంలో లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారం జరగడం ఇదే తొలిసారి. తొలుత ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు.
18వ లోక్‌సభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణం చేస్తారు.
దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎయిర్‌లైన్ హబ్‌గా మారుస్తామని పౌరవిమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు వెల్లడించారు.
2024-25 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ జూలై మూడో వారంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ ఆ శాఖ సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. 2024-25 బడ్జెట్ రూపకల్పన ప్రక్రయ ప్రారంభించాలని ఆదేశించారు.