Share News

Parliament Session: మోదీ ప్రసంగిస్తుండగా సభ్యులకు ఆదేశాలు.. రాహుల్‌ను మందలించిన స్పీకర్ ఓం బిర్లా

ABN , Publish Date - Jul 02 , 2024 | 05:42 PM

రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారంనాడు లోక్‌సభలో సమాధానమిస్తుండగా సభలో గలభా చోటుచేసుకుంది. దీంతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మందలించారు.

Parliament Session: మోదీ ప్రసంగిస్తుండగా సభ్యులకు ఆదేశాలు.. రాహుల్‌ను మందలించిన స్పీకర్ ఓం బిర్లా

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారంనాడు లోక్‌సభలో సమాధానమిస్తుండగా సభలో గలభా చోటుచేసుకుంది. దీంతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla) మందలించారు. ప్రధాని ప్రసంగం ప్రారంభించగానే పోడియం వద్దకు వెళ్లాలంటూ తమ సభ్యులను రాహుల్ ఆదేశించారు. దీనిపై స్పీకర్ వెంటనే స్పందిస్తూ ''సభలో మాట్లాడేందుకు మీకు తగిన సమయం ఇచ్చాను. పార్లమెంటు గౌరవాన్ని పాటించండి'' అని రాహుల్‌కు సూచించారు.

PM Narendra Modi: అదే మా మంత్రం.. ప్రధాని మోదీ ప్రసంగంలోకి కీ-పాయింట్స్


''డియర్ ఎల్‌ఓపీ...ఇది మీకు తగదు. మీకు మాట్లాడేందుకు తగినంత అవకాశం, సమయం ఇచ్చాను. సభానాయకుడు మాట్లాడుతున్నప్పుడు సభకు ఆదేశాలు ఇవ్వడం సరికాదు. పార్లమెంటరీ సంప్రదాయలకు ఇది తగదు. పార్లమెంటు గౌరవాన్ని నిలబెట్టండి. ఈ విధానం సరికాదు. పోడియం వద్దకు వెళ్లమని మీరు సభ్యులను ఆదేశిస్తున్నారు. విపక్ష నేతగా ఇలాగేనా వ్యవహరించేది?'' అని రాహుల్‌ను ఓం బిర్లా మందలించారు.

Read Latest National News and Telugu News

Updated Date - Jul 02 , 2024 | 05:42 PM