Home » Personal finance
మౌలిక ఆర్థిక సూత్రాలను కచ్చితంగా అమలు చేస్తే మధ్యతరగతి వారు కూడా సంపన్నులు కావచ్చు. ఆర్థిక భద్రత, ప్రశాంతతను పొందొచ్చు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
25 ఏళ్ల వయసు నుంచే రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేస్తే ఎన్పీఎస్ ద్వారా పదవీవిరమణ తరువాత నెలనెలా రూ.1.5 లక్షల పెన్షన్, రూ.6.75 కోట్ల రిటైర్మెంట్ కార్పస్ పొందొచ్చు. ఎన్పీఎస్ పథకంతో ఇది సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు.
పర్సనల్ లోన్ తీసుకునే ముందు సంస్థ ట్రాక్ రికార్డు, చెల్లింపులకు ఉన్న వ్యవధి, లేట్ ఫీజులు, ఫ్రాసెసింగ్ ఫీజులు, పెనాల్టీలు వంటివన్నీ సరిచూసుకున్నాకే ముందడుగు వేయాలని నిపుణులు చెబుతున్నారు.
ఇటివల కాలంలో వ్యక్తిగత రుణాలను బ్యాంకులు, NBFCలు చాలా సులభంగా ఇస్తున్నాయి. దీంతో అనేక మంది వీటిని తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఈ రుణాలు తీసుకునేటప్పుడు కొన్ని ఛార్జీల గురించి(hidden charges) తప్పనిసరిగా తెలుసుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Best Investment Tips: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ తమ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనుకుంటున్నారు. అంతేకాదు.. విశ్రాంతి సమయంలో తాము సైతం ప్రశాంతంగా జీవించేందుకు ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు అవసరమైన ప్లాన్స్ చేస్తుంటారు.
Internet Banking Tips: గతంలో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపాలన్నా బ్యాంకుల వద్దకు వెళ్లి మాత్రమే చేయాల్సి ఉండేది. కానీ, ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ అందిపుచ్చుకుని.. అవసరాన్నింటినీ అరచేతిలో ఇమిడే స్మార్ట్ఫోన్తోనే చేసేస్తున్నారు ప్రజలు.
మదింపు ఏడాది 2024-25కు (ఆర్థిక సంవత్సరం 2024-25) సంబంధించిన ఐటీఆర్ దాఖలు గడువు జులై 31, 2024గా ఉంది. దీంతో చెల్లింపుదారులకు మరో 20 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. పన్ను చెల్లించాలా లేదా రిఫండ్ వస్తుందా అనేది ఆదాయ పన్ను దాఖలు ద్వారానే తెలియజేయాల్సి ఉంటుంది.
New Delhi: కరోనా తరువాత చాలా మంది ప్రజల సొంత వాహనాలు కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రజా రవాణాలో ప్రయాణించడం కారణంగా ఏమైనా వ్యాధులు సోకే ప్రమాదం ఉందని భావించి.. చాలా మంది కార్లను కొనుగోలు చేస్తున్నారు.
Vespa 946 Dragon Edition: ఆటోమొబైల్ రంగంలో ఆయా కంపెనీల మధ్య పోటీ తీవ్రతరం అవుతోంది. వినియోగదారుల అభిరుచులకు అనుణంగా.. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ఉపయోగించి మంచి మంచి ఫీచర్లతో వాహనాలను తయారు చేస్తున్నాయి కంపెనీలు. తాజాగా ఇటాలియన్ మోటార్ కంపెనీ పియాజియో గ్రూప్ సరికొత్త వెస్పా స్కూటర్ను విడుదల చేసింది.
Sukanya Samriddhi Yojana: సాధారణంగా సగటు మధ్యతరగతి కుటుంబంలో ఆడపిల్ల పుట్టిందంటే చాలు.. ఆ తల్లిదండ్రులు అమ్మాయి చదువు, పెళ్లి తదితర ఖర్చుల విషయంలో ఆందోళనగా ఉంటారు. అందుకే.. బిడ్డ భవిష్యత్ కోసం లెక్కలేసుకుని ఏం చేయాలా? అని ఆలోచిస్తుంటారు. ఇలాంటి ఆందోళనలను దూరం చేసేందుకు ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది.