SIP: ఎస్‌ఐపీ వర్సెస్ సంప్రదాయిక పెట్టుబడులు.. ఆర్థిక భద్రతకు ఏది బెటర్!
ABN , Publish Date - Dec 13 , 2024 | 08:19 PM
ఆర్థిక భద్రత సాధించేందుకు మంచి పెట్టుబడి సాధనాలు ఎంచుకోవడం అత్యంత ముఖ్యం. ప్రస్తుతం భారతీయుల ముందు పెట్టుబడులకు సంబంధించి ప్రధానంగా రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అవేంటంటే..
ఇంటర్నెట్ డెస్క్: ఆర్థిక భద్రత సాధించేందుకు మంచి పెట్టుబడి సాధనాలు ఎంచుకోవడం అత్యంత ముఖ్యం. ప్రస్తుతం భారతీయుల ముందు పెట్టుబడులకు సంబంధించి ప్రధానంగా రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. సంప్రదాయిక పెట్టుబడి సాధనాలైన సేవింగ్స్ అకౌంట్లు, ఫిక్సిడ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లతో పాటు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు అవకాశం ఇచ్చే సిస్టమిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఐపీ) కూడా అందుబాటులో ఉంది (Personal Finance).
Personal Finance: క్రెడిట్ స్కోరు 800 దాటితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఏమిటీ ఎస్ఐపీ..
ఎస్‌ఐపీ సాయంతో పెట్టుబడిదారులు నెలవారీ లేదా మూడు నెలలకు ఓసారి క్రమంగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టొచ్చు. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకునేలా ఎస్‌ఐపీలను నిర్వహిస్తుంటారు. వీటిల్లో పెట్టుబడులతో ఆర్థిక క్రమశిక్షణ కూడా అలవడుతుందని అంటున్నారు. ఇక ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే ఎస్‌ఐపీ కాలిక్యులేటర్ ద్వారా ఎంత పెట్టుబడితో ఎంత లాభం వస్తుందో కొంత వరకూ అంచనాకు రావచ్చు.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎస్‌ఐపీలు ఇప్పటికే మంచి రాబడులు సాధించాయని నిపుణులు చెబుతున్నారు. సుదీర్ఘకాలం పాటు వీటిల్లో క్రమం తప్పకుండా పెట్టుబడులు పెడితే మార్కెట్ హెచ్చుతగ్గులకు అతీతంగా కొంత మేర మంచి లాభాలు కళ్ల చూడొచ్చు. అయితే, మార్కెట్ ఒడిదుడుకుల నుంచి ఎస్‌ఐపీలకు పూర్తి రక్షణ ఉంటుందని మాత్రం చెప్పలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రిస్క్‌ను వీలైనంతగా పరిమితం చేస్తూ రాబడులను పెంచడమే వీటి ప్రధాన ఉద్దేశమని అంటున్నారు. ఎఫ్‌డీలు, సేవింగ్స్ అకౌంట్లల్లోలా ఎస్‌ఐపీలపై స్థిరరాబడికి గ్యారెంటీ ఏమీ ఉండదని కూడా చెబుతున్నారు.
Personal Finance: మీ నెల జీతం రూ. లక్షన్నరా? ఇంతకు మించి ఖరీదైన ఇల్లు మాత్రం కొనొద్దు!
అయితే, కొన్ని తరాలుగా ప్రజల నమ్మకం చూరగొన్న ఎఫ్‌డీలు, రికరింగ్ డిపాజిట్లకు ఇప్పటికీ డిమాండ్ ఉందనేది నిపుణులు చెప్పేమాట. పెట్టుబడికి రక్షణ, స్థిరరాబడి కారణంగా అనేక మంది వీటివైపు మొగ్గు చూపుతున్నారు.
ఇక సాధారణ సేవింగ్స్ డిపాజిట్‌లతో పోలిస్తే ఎఫ్‌డీలపై రాబడి ఎక్కువన్న విషయం తెలిసిందే. ఏడు నుంచి 10 ఏళ్ల కాలపరిమితిపై ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టొచ్చు. కాలపరిమితి ముగిసే వరకూ వడ్డీ రేట్లల్లో ఎటువంటి మార్పులు ఉండవు. దీనికి తోడు ముందస్తుగా పెట్టుబడి ఉపసంహరించుకుంటే కొంత పెనాల్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది.
ఇక ఏకమొత్తంలో ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టలేని వారి ముందున్న గొప్ప ప్రత్యామ్నాయం ఆర్‌డీ. ఇందులో భాగంగా పెట్టుబడిని నెలవారీ ఆర్డీల్లోకి మళ్లించవచ్చు. ఆర్‌డీపై వడ్డీ కూడా కాలపరిమితి ముగిసే వరకూ స్థిరంగానే ఉంటుంది. ఇక అన్నిటికంటే తక్కువ వడ్డీ ఇచ్చేది సేవింగ్స్ అకౌంట్. ఇందులోని డబ్బును కావాల్సినప్పుడు ఉపసంహరించుకునే వీలు ఉండటంతో వడ్డీ తక్కువగా ఉంటుంది. ఈ పెట్టుబడి సాధనాల్లో మూలధనానికి ఎటువంటి రిస్క్ లేకపోవడం కూడా పెట్టుబడిదారులు ఈవైపు మళ్లడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
Life Insurance: జీవిత బీమా తీసుకుంటున్నారా? ఈ 6 విషయాల్లో జాగ్రత్త!
ఇక రిస్క్ భరించేందుకు సిద్ధపడ్డ వారికి ఎస్‌ఐపీలు మంచి పెట్టుబడి సాధనమని నిపుణులు చెబుతున్నారు. నెలకు రూ.500 మొదలు ఎంత మొత్తమైనా పెట్టుబడి పెట్టే అకాశం ఉండటంతో ఇది చిన్న ముదుపర్లకు కూడా ఉపయుక్తం. ఇక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించిన ఎస్‌ఐపీలు దీర్ఘకాలంలో మంచి రాబడులను ఇస్తున్నట్టు ఇప్పటికే రుజువైందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, రిస్క్ ఇష్టపడి వారు సంప్రదాయిక సాధనాలవైపు మళ్లుతుంటే అధికరాబడుల కోసం రిస్క్‌లకు సిద్ధమైన వారు ఎస్‌ఐపీలవైపు మళ్లుతున్నారట.