Home » Ponguleti Srinivasa Reddy
వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అన్నదాతల బాధలు చూసి వారిని ఆదుకునేందుకు ఎకరాకు రూ.10వేలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.
Telangana: ‘‘అటు కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలకు, ఇటు రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్యవర్తిత్వం చేస్తూ కాపాడుతుంది నిజం కాదా.. కాంగ్రెస్ ఇప్పటి వరకు బీఆర్ఎస్పైన ఈడీ విచారణ, సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశాలు ఇవ్వడం లేదు. సీబీఐ విచారణ నేరుగా రాష్ట్రంలో చేయడానికి వీలు లేదని జీవో తెచ్చింది బీఆర్ఎస్ కాదా’’..
అమృత్ పథకం నిధుల్లో రూ.8888 కోట్ల అవినీతి జరిగిందని కేటీఆర్ చేసిన ఆరోపణలను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి.
విపక్ష పార్టీపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక ప్రతిపక్ష పార్టీలు తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన..
ఇకపై ప్రతి వారం.. బుధ, శుక్ర వారాల్లో ఎవరైనా ఒక మంత్రి.. గాంధీ భవన్లో పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు.
సాగర్ ఎడమకాల్వ రెండోజోన్ పరిధిలోని ఖమ్మం జిల్లా కల్లూరు డివిజన్ మధిర బ్రాంచ్ కాల్వకు సత్వరమే సాగునీరు అందించి ఎండిపోతున్న వరి పైరును కాపాడాలని ఆ ప్రాంత రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు పంటలు దెబ్బతిన్న రైతులకు రెండు రోజుల్లో తక్షణ సాయంగా రూ.10వేలు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో వరద నష్టం రూ.10,300 కోట్లు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది.
వరద బాధితులకు సర్కారు అండగా ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.