Minister Ponguleti : సంక్షేమ పథకాల అమలుపై మంత్రి పొంగులేటి షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Dec 14 , 2024 | 01:50 PM
కేసీఆర్ ప్రభుత్వ ఆర్థిక దోపిడీ కారణంగా సంక్షేమ పథకాలు అమలుకు కాస్త ఆలస్యమైందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకి మిత్తి కట్టడానికే తెలంగాణ ఆర్థిక వనరులు సరిపోవటం లేదని అన్నారు. తప్పని సరిగా ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.
ఖమ్మం జిల్లా: కేసీఆర్ పాలనలో హాస్టళ్లలో దుర్భర దయనీయ పరిస్థితులు ఉన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. పిల్లలను పాత కోళ్ల ఫారం షెడ్లలో పాడుపడిన భవనాల్లో ఉంచారని అన్నారు. సరైన భోజనం పెట్టలేదు దయనీయ స్థితిలో పేద పిల్లలు అవస్థలు పడ్డారని అన్నారు. ఈ పరిస్థితి చూసి చలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నారని అన్నారు.
సకల సదుపాయాలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో కొన్ని అమలు చేయలేకపోయామని ఇది వాస్తవమని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ ఆర్థిక దోపిడీ కారణంగా సంక్షేమ పథకాలు అమలుకు కాస్త ఆలస్యమైందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకి మిత్తి కట్టడానికే తెలంగాణ ఆర్థిక వనరులు సరిపోవటం లేదని అన్నారు. తప్పని సరిగా ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్న మాట వాస్తవమని చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల అధిగమించి పేదల ప్రభుత్వంలో పేదల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.
వరిలో తెలంగాణ నెంబర్ వన్: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
భద్రాద్రి కొత్తగూడెం: రైతులకు మేలు చేసేలా వ్యవసాయ విద్యలో పరిశోధనలు జరగాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇవాళ(శనివారం) అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజ్‌లో ఆచార్య జయశంకర్ యూనివర్సిటీ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కలెక్టర్ జితేష్ పాటిల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు సైంటిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పూజ్యులు నందమూరి తారక రామారావు వల్లే అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేశామని అన్నారు.
35 ఏళ్ల ప్రస్థానంలో రెండు వేల 500 మంది వ్యవసాయ విద్యార్థులు తయారు అయ్యారని చెప్పారు. వ్యవసాయ కళాశాల తన కలల పంట అని చెప్పారు. ఇతర వ్యవసాయ కళాశాలలకు ఆదర్శంగా అశ్వారావుపేట కాలేజ్ ఉండాలని చెప్పారు. పంటలకు వాల్యూ యాడెడ్ రావాలంటే ప్రాసెసింగ్ ప్లాంట్స్ నెలకొల్పాలని చెప్పారు. పామాయిల్ మొక్కల నుంచి బై ప్రాడెక్ట్స్ పరిశోధనలు జరగాలన్నారు. భవిష్యత్‌లో కలెక్టర్ ఎస్పీల కంటే ఎక్కువ ఆదాయం పామాయిల్ రైతులకు వస్తుందని తెలిపారు. వరిలో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందని చెప్పారు. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపేలా ప్రణాళిక చేయాలని సూచించారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో ఆధునిక మౌలిక వసతులు ఏర్పాటు బాధ్యత తనదేనని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Allu Arjun: చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల
Hyderabad: సీఎం రేవంత్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ.. దాంట్లో ఏమున్నదంటే..
For Telangana News And Telugu News