Ponguleti: నిలువ నీడలేదు సార్.. ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి
ABN , Publish Date - Dec 15 , 2024 | 03:21 AM
మరిపెడ మునిసిపల్ కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో శనివారం ‘న్యూ కామన్ డైట్ మెనూ’ ప్రారంభించడానికి వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి పర్యటనలో అనూహ్య సంఘటన జరిగింది.
మంత్రి పొంగులేటిని కోరిన విద్యార్థి
వెంటనే మంజూరు చేయాలని కలెక్టర్‌కు మంత్రి ఆదేశం
వరంగల్ మరిపెడ సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో ఘటన
మరిపెడ, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): మరిపెడ మునిసిపల్ కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో శనివారం ‘న్యూ కామన్ డైట్ మెనూ’ ప్రారంభించడానికి వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి పర్యటనలో అనూహ్య సంఘటన జరిగింది. పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి మంత్రి వద్దకు వచ్చి.. ‘సార్ నేను మీ వీరాభిమానిని. మా కుటుంబానికి ఇల్లులేదు. పూరిగుడిసెలో ఉం టున్నాం. అమ్మానాన్న కష్టపడుతున్నారు. మాకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి సార్’ అని వెక్కి వెక్కి ఏడ్చాడు. స్పందించిన మంత్రి బాలుడిని ఓదార్చి.. వెంటనే ఆ విద్యార్థి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్‌ను ఆదేశించారు.