SP : రెచ్చగొట్టే పోస్టులు పెడితే చర్యలు
ABN , Publish Date - Jun 08 , 2024 | 11:53 PM
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే పోస్ట్ చేసిన వారితో పాటు గ్రూప్ అడ్మినలపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ గౌతమి శాలి హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం వాట్సాప్, ఫేస్‌బుక్, ఇనస్టాగ్రాం తదితర సోషల్ మీడియాలో చాలా మంది రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారని పేర్కొన్నారు. ఇళ్లను ముట్టడిస్తాం, దాడులు చేస్తామని బెదిరిస్తూ, తీవ్రమైన హెచ్చరికలు చేస్తూ పోస్టులు పెడుతున్నారని అన్నారు. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, అవాస్తవాలు ..
అనంతపురం క్రైం, జూన 8: సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే పోస్ట్ చేసిన వారితో పాటు గ్రూప్ అడ్మినలపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ గౌతమి శాలి హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం వాట్సాప్, ఫేస్‌బుక్, ఇనస్టాగ్రాం తదితర సోషల్ మీడియాలో చాలా మంది రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారని పేర్కొన్నారు. ఇళ్లను ముట్టడిస్తాం, దాడులు చేస్తామని బెదిరిస్తూ, తీవ్రమైన హెచ్చరికలు చేస్తూ పోస్టులు పెడుతున్నారని అన్నారు. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, దీనివల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని
పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఈ తరహా పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూప్‌లలో సభ్యులు ఏది పడితే అది పోస్ట్ చేయకుండా గ్రూప్ అడ్మినలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లేదంటే గ్రూప్ సభ్యులు చేసిన పోస్టులకు సైతం గ్రూప్ అడ్మిన్లే బాధ్యులవుతారని హెచ్చరించారు. రెచ్చగొట్టే పోస్టులు, వదంతులు, తప్పుడు ప్రచారాలపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెచ్చగొట్టే పోస్టులు, ఫొటోలు, వీడియోలను షేర్ చేయడం, స్టేట్‌సలుగా పెట్టుకోవడం నిషిద్ధమని అన్నారు. ఈ విషయంలో గ్రూప్ అడ్మిన్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....