Delhi Poll: ఆప్ ప్రచార పోస్టర్.. అవీనితిపరుల జాబితాలో రాహుల్
ABN , Publish Date - Jan 25 , 2025 | 03:03 PM
ఆప్, బీజేపీ వినూత్న శైలిలో ఇంతవరకూ పోటాపోటీగా పోస్టర్లు విడుదల చేయగా, అవీనితిపరుల జాబితా అంటూ రాహుల్‌ను కూడా అందులో చేర్చడం ఇదే మొదటిసారి.

న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో 'ఇండియా'(INDIA) కూటమి భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, ఆప్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. ఉభయ పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 'ఆమ్ ఆద్మీ పార్టీ' (AAP) కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. అవినీతిపరుల జాబితాతో విడుదల చేసిన ఈ కొత్త పోస్టర్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఫోటోను కూడా చేర్చింది. ఆప్, బీజేపీ వినూత్న శైలిలో ఇంతవరకూ పోటాపోటీగా పోస్టర్లు విడుదల చేయగా, అవీనితిపరుల జాబితా అంటూ రాహుల్‌ను కూడా అందులో చేర్చడం ఇదే మొదటిసారి.
Patanjali: మార్కెట్ నుంచి ‘పతంజలి’ కారం వెనక్కి..
నిజాయితీలేని వ్యక్తులందరినీ నిజాయితీపరుడైన కేజ్రీవాల్ మించిపోయారు (కేజ్రీవాల్ హానిస్టీ విల్ టేక్ ఆన్ ది కరప్ట్) అనే శీర్షికతో ఆప్ వేసిన ఈ పోస్టర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ నేతలు రమేష్ బిధూడి, ఢిల్లీ విభాగం అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ తదితరులు ఉన్నారు.
జాతీయ స్థాయిలో 'ఇండియా' కూటమి భాగస్వాములుగా కాంగ్రెస్, ఆప్ ఉన్నప్పటికీ మొదట్లోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామంటూ ఆప్ ప్రకటించడంపై కాంగ్రెస్ గుర్రుమంటోంది. దీనికి తోడు ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలైన సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ బాహాటంగానే కేజ్రీవాల్‌కు మద్దతు ప్రకటించాయి. శరద్ పవార్ ఎన్‌సీ సైతం ఆప్ వైపు మొగ్గుచూపుతోంది. ఈ క్రమంలో ఆప్‌ను టార్గెట్ చేస్తూ రాహుల్ గాంధీ, అజయ్ మాకెన్ ప్రచార పర్వం సాగిస్తు్న్నారు. మోదీ తరహాలోనే కేజ్రీవాల్ తప్పుడు హామీలు గుప్పిస్తున్నారని, కాలుష్య నివారణ, ద్రవ్యోల్బణం అరికట్టడంలో కేజ్రీవాల్ దారుణంగా విఫమమయ్యారని రాహుల్ ఆరోపించారు. ఆరోగ్య శాఖలో భారీ కుంభకోణం జరిగిందంటూ కాగ్ నివేదిక ఇవ్వడంతో ఆ నివేదికను అసెంబ్లీకి సమర్పించకుండా కేజ్రీవాల్ జాప్యం చేశారని అజయ్ మాకెన్ మండిపడ్డారు.
పరువునష్టం కేసు వేస్తామన్న సందీప్ దీక్షిత్
ఆప్ పోస్టర్‌పై న్యూఢిల్లీ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ సీరియస్ అయ్యారు. సాక్ష్యాలు లేకుండా స్టేట్‌మెంట్లు ఇవ్వడం కేజ్రీవాల్‌కు ఒక అలవాటుగా మారిందని, దీనిపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేస్తుందని అన్నారు. కేజ్రీవాల్‌పై క్రిమినల్ పరువునష్టం కేసు వేస్తానని చెప్పారు.
ఇవి కూడా చదవండి