Home » Prajwal Revanna
మహిళలపై లైంగిక దాడికి పాల్పడటం, అశ్లీల వీడియోలను రికార్డు చేయడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ..
రాసలీల పెన్ డ్రైవ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ బెంగుళూరుకు బయలుదేరారు. గురువారం ఉదయం 11.20 గంటలకు జర్మనీలో మ్యూనిచ్ నగరంలోని ఎయిర్ పోర్ట్ నుంచి బిజినెస్ క్లాస్ విమానంలో ప్రజ్వల్ బెంగుళూరుకు బయలుదేరారు.
లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. కోర్టులో ప్రజ్వల్ పేరుతో ఆయన తరఫు న్యాయవాది అరుణ్ ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు.
లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్‌కు రంగం సిద్దమైంది. మే 31వ తేదీ అంటే శుక్రవారం తెల్లవారుజామున జర్మనీ నుంచి ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరు చేరుకోనున్నారు. ఆ క్రమంలో కెంపె గౌడ ఎయిర్ పోర్ట్‌లో ప్రజ్వల్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
రాసలీలల పెన్ డ్రైవ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తొలిసారి స్పందించారు. ఈ కేసులో సిట్ ముందు హాజరవుతానని ప్రజ్వల్ తెలిపారు.
సిద్ధరామయ్య కుమారుడు రాకేష్ 2016లో బెల్జియంలో మరణించడంపై హెచ్‌డీ కుమారస్వామి ప్రశ్నించారు. అప్పుడు సీఎంగా ఉన్న సిద్ధరామయ్య ఎందుకు రాకేష్ మృతిపై దర్యాప్తునకు ఆదేశించలేదని నిలదీశారు.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ, జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna Scandal) పాస్‌పోర్టు రద్దు(Passport Seize) చేయాలని కర్ణాటక ప్రభుత్వం శాశ్వత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు(MEA) శుక్రవారం లేఖ రాసింది.
రాసలీల వీడియోల్లో అడ్డంగా దొరికిపోయిన తన మనవడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వెంటనే భారత్ తిరిగి వచ్చి.. పోలీసులకు లొంగిపోవాలని అతడి తాత, మాజీ ప్రధాని దేవగౌడ సూచించారు. లేకుంటే తన ఆగ్రహాన్ని చవి చూడాల్సి ఉంటుందని ప్రజ్వల్‌ను ఈ సందర్బంగా ఆయన హెచ్చరించారు.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్యపరమైన పాస్‌పోర్ట్ రద్దుకు సంబంధించి కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రజల్వ్ రేవణ్ణ పాస్‌పోర్ట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన్ ఎంపీ ప్రజ్వల్‌పై బెంగళూరు నగరంలోని 42వ ఏసీఎంఎం కోర్టు శనివారం అరెస్టు వారెంట్ జారీ చేసింది. ప్రజ్వల్‌పై ఇప్పటి వరకు దాఖలు చేసిన నోటీసుల గురించి కోర్టు..