Home » Pressmeet
వైఎస్సార్ భార్య విజయలక్ష్మి, కూతురు షర్మిళపై భారతీరెడ్డి వ్యక్తిగత సహాయకుడు వర్రా రవీందర్ రెడ్డి, బోరుగడ్డ అనిల్, శ్రీరెడ్డి మాట్లాడిన మాటలకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు సిగ్గుతో తల దించుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు అన్నారు.
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టి గురుకుల, ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని, వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నా సర్కార్ పట్టించుకోవడం లేదని విద్యార్థుల అవస్థలు సీఎం రేవంత్ రెడ్డి కంటికి కనిపించడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు.
తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మెగా కృష్ణారెడ్డిలు తెలంగాణను దోచుకుంటున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. నీటి ప్రాజక్టుల పేరుతో ముఖ్యమంత్రి భారీ స్కాంలకు తెర తీశారని, మంత్రి పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్స్, మెగా కృష్ణారెడ్డి కంపెనీలు పంచుకుంటున్నాయని ఆయన విమర్శించారు.
మాజీ సర్పంచ్లు అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్మి, భార్యా పిల్లల మీద ఉన్న బంగారం కుదువ పెట్టి గ్రామ అభివృద్ధి కోసం చేసిన డబ్బులు ఇవ్వాలంటే ప్రభుత్వం అరెస్టులు చేస్తున్నదని హరీష్రావు మండిపడ్డారు. ప్రజాపాలన అంటే ఊరికి సేవ చేసిన సర్పంచులను అరెస్టులు చేయడమేనా.. అని ప్రశ్నించారు.
రుణమాఫీ కానీ రైతులకు తప్పక మాఫీ జరుగుతుందని, రైతు భరోసా విషయంలో పంట భూముల్లో ప్రక్షాళన జరుగుతుంది కాబట్టి కొంత ఆలస్యం జరుగుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.రూ. 1.20 కోట్లతో ఉమామహేశ్వర ఆలయాన్ని ప్రభుత్వం మరింత అభివృద్ధి చేయనుందని ఆయన అన్నారు.
2019లో షర్మిలా రెడ్డికి 100 శాతం వాటాలు బదలాయిస్తామని జగన్ స్పష్టంగా పేర్కొంటూ ఎంవోయూ (MOU) మీద సంతకం చేశారని.. అప్పుడు బెయిల్ రద్దు అవుతుందని తెలియదా అని షర్మిల ప్రశ్నించారు. 2021లో క్లాసిక్ రియాలిటీ, సండూర్ పవర్కు చెందిన , సరస్వతి షేర్లను రూ. 42 కోట్లకు అమ్మ విజయమ్మకు ఎలా అమ్మారని నిలదీశారు.
జగన్ పాలన వెలిగొండ ప్రాజెక్టుకు శాపంగా మారిందని, టన్నెల్స్, ఫీడర్ కెనాల్, రిజర్వాయర్ పనులు, నిర్వాసితులకు 880 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా, ఒక రూపాయి కూడా జగన్ ఇవ్వలేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఎన్నికల ముందు వెలుగొండ జాతికి అంకితం అనడం, జగన్ మార్క్ మోసం.. దగా అని దుయ్యబట్టారు.
ప్రధాని మోదీతో సహా అందరూ వారి సభ్యత్వాన్ని పునరుద్దరించుకోవటం జరుగుతుందని, 2014 లో ఆరు నెలల పాటు సభ్యత్వాన్ని నమోదు చేసామని, ఆన్లైన్ ద్వారా మొదటి సారి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు.
మద్యంలో వైసీపీ నేతలు అడ్డంగా దోచుకున్నారని జనసేన ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ ఆరోపించారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తే... మిథున్ రెడ్డి అండ్ కో బాగోతాలు బయట పడతాయన్నారు. లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి, కసిరెడ్డి పాత్ర ఉందన్నారు. మద్యం షాపులో కూడా వైసీపీ నేతలు భారీగా దోచుకున్నారని, ఔట్ సౌర్స్ విభాగం ఏర్పాటు చేసి కొట్ల రూపాయలు కొల్లగట్టారని ధ్వజమెత్తారు.
ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక పోలీసుల పట్ల ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. పోలీసుల ఆవేదన ఎందుకు అర్థం చేసుకోవడం లేదని అన్నారు. అధికారం లేకుంటే ఒక మాట.. అధికారంలోకి వచ్చాక ఇంకో మాటనా.. అంటూ నిలదీశారు.