Home » Rahul Gandhi
సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టి డిసెంబరు 7 నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఏఐసీసీ పెద్దలను ఆయన కలవనున్నారు.
కేరళ రాష్ట్రం వయనాడ్ లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నికల ఫలితాల్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా భారీ మెజార్టీతో దూసుకుపోతున్నారు. ఏకంగా నాలుగు లక్షల ఓట్ల ఆధిక్యంతో ఆమె ముందంజలో ఉన్నారు.
Gautam Adani Bribery Case: ప్రముఖ బిలియనీర్, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కేసు ఒక్కసారిగా దేశాన్ని కుదిపేసింది. ఆయన మోసానికి పాల్పడినట్లు న్యూయార్క్‌లో కేసు నమోదైంది. ఇప్పుడంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు.
మరికొద్ది రోజుల్లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయని, వాయు కాలుష్య సంక్షోభంపై సమగ్రంగా చర్చించాల్సిన బాధ్యత ఎంపీలపై ఉందని రాహుల్ అన్నారు. దేశం ఎదుర్కొంటున్న ఈ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కనుగొనాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ విషయంలో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒకలా, గల్లీలో మరోలా మాట్లాడున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
గౌతమ్ అదానీకి ప్రధాని మోదీ రక్షణ కవచంగా నిలిచారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అదానీ అవినీతి గురించి అమెరికాలో కేసు నమోదైందని గుర్తుచేశారు. భారతదేశంలో కేసు నమోదు కాదని.. ఎందుకంటే అదానీ వెనక మోదీ ఉన్నారని ఆరోపణలు చేశారు.
ప్రధాని మోదీ గత మూడేళ్లలో చేయలేని కులగణనను తెలంగాణలోని తమ ప్రభుత్వం మరో మూడు వారాల్లో పూర్తి చేయనుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర గిగ్ వర్కర్ల విధానం ముసాయిదా రూపకల్పనకు అన్ని పక్షాలతో సంప్రదింపులు జరపాలని సీఎం రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కోరారు. అన్ని పక్షాల అభిప్రాయాలను తీసుకోవడం వల్ల పటిష్ఠ, ప్రభావవంతమైన విధానాన్ని రూపొందించవచ్చని తెలిపారు.
నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోమవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడారు. తన వాదనకు బలం చేకూర్చే రెండు పోస్టర్లను ఆయన ప్రదర్శించారు.
అమెరికా అధ్యక్షుడు బైడెన్ లాగే ప్రధాని మోదీ కూడా జ్ఞాపకశక్తి కోల్పోయారని రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ మాట్లాడే విషయాలపైనే ఆయన మాట్లాడుతున్నారని మండిపడ్డారు.