Rahul Letter to PM Modi: ఆఫ్‌షోర్ మైనింగ్‌కు అనుమతించొద్దు.. ప్రధానికి రాహుల్ లేఖ
ABN , Publish Date - Mar 29 , 2025 | 06:08 PM
పర్యావరణపరంగా ఎదురయ్యే పరిణామాలను పరిగణనలోకి తీసుకోకుండా, కోస్తాతీర కమ్యూనిటీల తీవ్ర నిరసలను పట్టించుకోకుండా ఆఫ్‌షోర్ మైనింగ్‌ను టెంటర్లు పిలవడం సరికాదని రాహుల్ గాంధీ తన లేఖలో పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: సముద్ర గర్భం నుంచి ఖనిజాలను వెలికితీసే 'ఆఫ్‌షోర్ మైనింగ్' (Offshore mininig)ను వ్యతిరేకిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లేఖ రాశారు. కేరళ, గుజరాత్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ తీరప్రాంతాల వెంబడి ఆఫ్‌షోర్ మైనింగ్‌కు అనుమతించాలన్న కేంద్ర నిర్ణయాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు.
Prashant Kishore: వక్ఫ్ సవరణ బిల్లుతో విభేదించిన పీకే... ఆ పార్టీకే నష్టమని జోస్యం
పర్యావరణపరంగా ఎదురయ్యే పరిణామాలను పరిగణనలోకి తీసుకోకుండా, కోస్తాతీర కమ్యూనిటీల తీవ్ర నిరసలను పట్టించుకోకుండా ఆఫ్‌షోర్ మైనింగ్‌ను టెంటర్లు పిలవడం సరికాదని రాహుల్ గాంధీ తన లేఖలో పేర్కొన్నారు. ఆఫ్‌షోర్ మైనింగ్‌తో తాము జీవనోపాధి కోల్పోతామంటూ లక్షలాది మంది లక్షలాది మంది మత్స్యకారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని, ఆఫ్‌షోర్ మైనింగ్ బ్లాక్‌లకు టెంటర్లను తక్షణమే రద్దు చేయాలని రాహుల్ విజ్ఞప్తి చేశారు.
ఆఫ్‌షోర్ మైనింగ్‌తో తీరప్రాత ఎకోసిస్టమ్ దెబ్బతినడంతో పాటు తమ జీవనోపాధికి గండిపడుతుందంటూ కోస్తాతీరంపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న వివిధ వృత్తుల వారు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రధానికి రాహుల్ గాంధీ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి..
Eknath Shinde Joke Row: కునాల్ కామ్రపై కొత్తగా మరో 3 కేసులు
Dy CM: డిప్యూటీ సీఎ వ్యంగ్యాస్త్రాలు.. కమలనాథుల దర్శనం కోసం కార్లు మార్చి మార్చి వెళ్ళారు
Cyber Fraud: ముసలి వాళ్లనే జాలి కూడా లేకుండా.. బరి తెగించిన సైబర్ నేరగాళ్లు
For National News And Telugu News