Share News

Rahul Gandhi: అమెరికాలో పర్యటించనున్న రాహుల్

ABN , Publish Date - Mar 28 , 2025 | 03:46 PM

రాహుల్ గాంధీ ఇంతకుముందు 2024 సెప్టెంబర్‌లో అమెరికాలో పర్యటించారు. తన పర్యటనలలో భాగంగా డల్లాస్‌కు వెళ్లి టెక్సాస్ యూనివర్శిటీ విద్యార్థులు, టీచర్లతో భేటీ జరిపారు. ప్రవాస భారతీయలను ఉద్దేశించి కూడా మాట్లాడారు.

Rahul Gandhi: అమెరికాలో పర్యటించనున్న రాహుల్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఏప్రిల్ 19 నుంచి అమెరికా (America)లో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. తన పర్యటనలో భాగంగా బ్రౌన్ యూనివర్శిటీని ఆయన సందర్శస్తారు. బోస్టన్‌లో ప్రవాస భారతీయులతోనూ భేటీ అవుతారు. రాహుల్ ఎన్ని రోజులు పర్యటిస్తారనే దానిపై పార్టీ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన లేదు.

PM Modi: థాయ్‌లాండ్, శ్రీలంకలో మోదీ పర్యటన ఖరారు


రాహుల్ గాంధీ ఇంతకుముందు 2024 సెప్టెంబర్‌లో అమెరికాలో పర్యటించారు. తన పర్యటనలలో భాగంగా డల్లాస్‌కు వెళ్లి టెక్సాస్ యూనివర్శిటీ విద్యార్థులు, టీచర్లతో భేటీ జరిపారు. ప్రవాస భారతీయలను ఉద్దేశించి కూడా మాట్లాడారు. డల్లాస్‌ నుంచి వాషింగ్టన్ డీసీ వెళ్లారు. అక్కడి జార్జిటౌన్ యూనివర్శిటీలో విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశమయ్యాయి. లోక్‌సభలో ప్రతిపక్షగా నేతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాలో తొలిసారి ఆయన ఈ పర్యటన జరిపారు. తన పర్యటనలో భారతదేశంలోని రిజర్వేషన్లు, మత స్వేచ్ఛ, సిక్కులను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. విదేశాల్లో భారత్ పరువును రాహుల్ మంటగలుపుతున్నారని బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది.


మాట్లాడనీయడం లేదు..

కాగా, రాహుల్ గాంధీ రెండ్రోజుల క్రితం లోక్‌సభ స్పీకర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. సభలో తాను మాట్లాడేందుకు స్పీకర్ అనుమతించడం లేది, అధికార పార్టీ ఎందుకు భయపడుతోందో తనకు అర్థం కావడం లేదని అన్నారు. విపక్ష నేత మాట్లాడాలనుకున్నప్పుడు ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని సభా సాంప్రదాయానికి పాటించడం లేదని వాపోయారు. అసలు సభలో ఏమి జరుగుతోందో తనకు తెలియడం లేదని, స్పీకర్ మాటలకు తాను జవాబు చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా సభను వాయిదా వేస్తున్నారని ఆరోపించారు.


ఇవి కూడా చదవండి..

Supreme Court: అంతర్గత విచారణ తర్వాతే ఎఫ్ఐఆర్.. జస్టిస్ వర్మపై పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం

Bengaluru: మా చేతులు కట్టేశారు..

Maoist Letter: ఆపరేషన్ కగార్... మావోల సంచలన లేఖ

For National News And Telugu News

Updated Date - Mar 28 , 2025 | 03:50 PM