Home » Ramoji Rao
ప్రముఖ మీడియా ప్రముఖుడు, రామోజీ గ్రూప్ చైర్మన్ రామోజీరావు(ramoji rao) మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా మోదీ రామోజీరావుకు నివాళులు ప్రకటించారు.
మీడియా ఐకాన్ రామోజీరావు ఈ రోజు తెల్లవారు జామున కన్నుమూశారు. రామోజీ మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినాయకురాలు మమతా బెనర్జీ స్పందించారు. తెలుగుజాతికి రామోజీరావు మార్గదర్శి అని కొనియాడారు. ఫిల్మ్ సిటీ సందర్శించాలని రామోజీ రావు తనను ఒకసారి ఆహ్వానించారని గుర్తుచేశారు.
అఖండమైన తెలుగు జ్యోతి ఆరిపోయిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. రామోజీ రావు వ్యక్తి కాదని, శక్తివంతమైన వ్యవస్థ అని పేర్కొన్నారు. జీవితంలో స్వయంకృషితో కష్టపడి అనేక రంగాల్లో విజయం సాధించి మనకు దూరమయ్యారని తెలిపారు. ఓ ధృవతారగా వెలుగుతూ ఉంటారని... ఆయన చేతలు, రాతలు, చేపట్టిన కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని భావిస్తున్నానని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావు గారి మరణంపై సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రామోజీరావుతో తనకు దశాబ్దాల అనుబంధం ఉందని..1991లో నెల్లూరులో పుట్టిన సారావ్యతిరేక ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన పాత్ర కీలకమని తెలిపారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఉద్యమం విజయవంతం కావడాన్ని బాధ్యతగా భావించారని వెల్లడించారు.
మీడియా దిగ్గజం రామోజీరావు మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రామోజీ రావు మృతి వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. తెలుగు మీడియా రంగానికి రామోజీ రావు ఎనలేని సేవలు అందించారని గుర్తుచేశారు.
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు(Ramoji Rao) ఇవాళ తెల్లవారుజామున ఆరోగ్య సమస్యలతో మృతిచెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్ నానక్‌రామ్ గూడలోని స్టార్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. గుండెకు స్టెంట్ వేసి, ఐసీయూలో ఉంచినా ఫలితం లేకుండా పోయింది. ఆయన మృతిపట్ల భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తీవ్ర సంతాపం తెలిపారు.
మీడియా దిగ్గజం, ప్రముఖ పారిశ్రామిక వేత్త రామోజీ రావు మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ‘రామోజీ రావు పేదల పక్షపాతి అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభిప్రాయ పడ్డారు.
రామోజీరావు(Ramoji Rao) మృతి పట్ల భాజపా, కాంగ్రెస్ అగ్రనేతలు రాజ్‌నాథ్‌సింగ్ (Rajnath Singh), మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) సంతాపం ప్రకటించారు. రామోజీరావు మరణం మీడియా, సినీ రంగానికి తీరని లోటని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు.
ప్రముఖ మీడియా నిపుణులు, రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీ రావు(87)(Ramoji rao) మృతి పట్ల తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్(KCR) దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటు రామోజీ కుంటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.
రామోజీరావు మరణం మీడియా రంగానికే తీరని లోటు అని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మీడియా, సినీ, టీవీ రంగాల్లో దిగ్గజంగా వెలిగిన రామోజీరావు మరణం బాధాకరమన్నారు. వ్యాపారాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని విజయపథంలో నడిపించిన మహా వ్యక్తి అని కొనియాడారు. ఒక భారతీయ వ్యాపారవేత్తగా, ఈనాడు గ్రూపు సంస్థల అధినేతగా ప్రపంచంలోనే గొప్ప పేరు సంపాదించుకున్న మహా మేధావి అని సీఎం రమేష్ కొనియాడారు.