Venkaiah Naidu: అఖండమైన తెలుగు జ్యోతి ఆరిపోయింది
ABN , Publish Date - Jun 08 , 2024 | 01:47 PM
అఖండమైన తెలుగు జ్యోతి ఆరిపోయిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. రామోజీ రావు వ్యక్తి కాదని, శక్తివంతమైన వ్యవస్థ అని పేర్కొన్నారు. జీవితంలో స్వయంకృషితో కష్టపడి అనేక రంగాల్లో విజయం సాధించి మనకు దూరమయ్యారని తెలిపారు. ఓ ధృవతారగా వెలుగుతూ ఉంటారని... ఆయన చేతలు, రాతలు, చేపట్టిన కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని భావిస్తున్నానని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
హైదరాబాద్: అఖండమైన తెలుగు జ్యోతి ఆరిపోయిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన కాసేపటి క్రితం రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి రామోజీ పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. రామోజీ రావు వ్యక్తి కాదని, శక్తివంతమైన వ్యవస్థ అని పేర్కొన్నారు. జీవితంలో స్వయంకృషితో కష్టపడి అనేక రంగాల్లో విజయం సాధించి మనకు దూరమయ్యారని తెలిపారు. ఓ ధృవతారగా వెలుగుతూ ఉంటారని... ఆయన చేతలు, రాతలు, చేపట్టిన కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని భావిస్తున్నానని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
పత్రిక పెట్టిన నాటి నుంచి వారితో ఎంతో సన్నిహితంగా ఉండేవాడినని.. ఆయనతో వివిధ సందర్భాల్లో చర్చించటం వల్ల పరిపక్వత చెందానని తాను భావిస్తానని వెంకయ్య నాయుడు తెలిపారు. వారు పోరాట యోధులని.. జీవితంలో మరింత కాలం పోరాడతారని భావించానన్నారు. విజయం సాధించినప్పటికీ, ఇంత త్వరగా వారు పోరాటాన్ని ముగిస్తారని అనుకోలేదన్నారు. తన కుటుంబ సభ్యులను అభిమానించే వారని పేర్కొన్నారు. మా కుటుంబం తరుఫున రామోజీరావు స్మృతికి నివాళులు అర్పిస్తున్నానన్నారు. వారి కుటుంబ సభ్యులందరికీ తన తరుఫున, తన కుటుంబ సభ్యుల తరుఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని రామోజీ తెలిపారు.
AP Politics: వైసీపీని ఓడించింది వాళ్లే.. జగన్ తీరుపై సొంత నేతల ఆగ్రహం..