Home » Shaik Haseena
ప్రధాని షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్ రాజకీయం సంక్షోభంలో పడింది. ఆ దేశ రాజకీయదాలు వేగంగా మారుతున్నాయి. మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు ఆదేశాధ్యక్షుడు ఆదేశాలు జారీచేశారు.
శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై పెద్ద ఎత్తున జరిగిన నిరసనలు .. చివరకు మాజీ అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష దేశం విడిచి మిలిటరీ జెట్‌లో పారిపోయేలా చేశాయి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వ్యవహారంలో అచ్చం ఇలాగే జరిగింది.
రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో ప్రధాని పదవికి రాజీనామా చేసి రక్షణ నిమిత్తం భారత్‌కి వచ్చిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)కు సంబంధించిన పలు అంశాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశంపై బంగ్లాదేశ్‌లో మొదలైన నిరసన.. ఆ దేశ ప్రధానిని గద్దె దింపే వరకు కొనసాగింది. ఓ విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగడంతో ఓ ప్రధాని తన పదవికి రాజీనామా చేసి.. ప్రాణ రక్షణ కోసం పొరుగు దేశానికి వెళ్లడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
బంగ్లాదేశ్‌ను కుదిపేస్తున్న ప్రస్తుత పరిణామాలకు ‘ముక్తియోధుల కోటా’పై ఆగ్రహమేనా? అంటే.. రిజర్వేషన్ల అంశం పైకి కనిపించే స్థూల కారణం మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు!
రిజర్వేషన్ల కోటా అంశంపై ఆందోళనకారులు, అధికార పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలతో బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. నిరసనకారులు తన అధికారిక నివాసాన్ని చుట్టుముట్టేందుకు రావడంతో షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) రాజీనామా చేసి సోమవారమే ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత పరిస్థితిని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ప్రధాని మోదీకి(PM Modi) వివరించారు.
రిజర్వేషన్ల కోటా అంశంపై ఆందోళనకారులు, అధికార పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలతో బంగ్లాదేశ్ అట్టుడికిపోతున్న వేళ ఆ దేశంలో శరవేగంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ఆర్మీ హెలీకాఫ్టర్లో భారత్‌లో అడుగుపెట్టారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశం బంగ్లాదేశ్ (Bangladesh Clashes)లో తీవ్ర అల్లర్లకు కారణమైంది. ఇప్పటికే ఆ దేశంలో వందల సంఖ్యలో నిరసనకారులు మృతి చెందారు. ఆదివారం ఒక్క రోజే పోలీసులు జరిపిన కాల్పుల్లో 100 మంది నిరసనకారులు చనిపోయారు.
రిజర్వేషన్ల కోటా అంశంపై ఆందోళనకారులు, అధికార పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలతో బంగ్లాదేశ్ తగలబడిపోతున్న వేళ ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.