Home » Sikkim
సినిమా విడుదలయ్యే ముందు ట్రైలర్ విడుదలైనట్లు.. జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఆ క్రమంలో మరికాసేపట్లో పలు సర్వే సంస్థలు, వివిధ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల ద్వారా ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించనున్నాయి.
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఈనెల 4వ తేదీన వెలువడనుండగా, దీనికి రెండ్రోజుల ముందుగానే జూన్ 2వ తేదీన అరుణాచల్ ప్రదేశ్ , సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని 60 అసెంబ్లీ స్థానాలు, సిక్కింలోని 32 నియోజకవర్గాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరిగింది.
భారత సరిహద్దుల్లో సిక్కింకు 150 కిలో మీటర్ల దూరంలో చైనా 6 అధునాతన యుద్ధ విమానాలను మోహరించింది
కేంద్ర మాజీ మంత్రి.. సిక్కిం, కేరళ మాజీ గవర్నర్ పి.శివశంకర్ సతీమణి లక్ష్మీబాయి (94) గురువారం ఉదయం కన్నుమూశారు. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిగాంచిన ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడుకి మేనకోడలు అయున లక్ష్మీబాయి వ్యక్తిగతంగానూ ప్రముఖులే.
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదివారంనాడు కీలక ప్రకటన చేసింది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీలను జూన్ 4వ తేదీకి బదులుగా జూన్ 2వ తేదీకి మార్చినట్టు తెలిపింది.
ఇప్పటివరకు రైల్వే స్టేషన్ లేని రాష్ట్రంగా ఉన్న సిక్కిం.. ఇక ముందు రైలు సర్వీసులను ప్రారంభించనుంది. సిక్కింలో తొలి రైల్వే స్టేషన్ రంగ్పో ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు.
సిక్కిం నుంచి రాజ్యసభ అభ్యర్థి పేరును బీజేపీ ఖరారు చేసింది. డోర్జీ త్రేసింగ్ లేప్చాను పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. న్యూఢిల్లీ నుంచి 3, సిక్కిం నుంచి ఒక రాజ్యసభ స్థానానికి జనవరి 19న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది.
నకిలీ పాస్ పోర్టులు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు సీబీఐ(CBI) అధికారులు. పలు ప్రాంతాల్లో జరిగిన ఈ తనిఖీల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ దందా ఏళ్లుగా నడుస్తోందని తెలుస్తోంది. విశ్వసనీయంగా తెలిసి సమాచారంతో దాడులు జరిపిన సీబీఐ చాలా మందిపై కేసులు నమోదు చేసింది.
సిక్కింలో క్లౌడ్ బరస్ట్(Cloud Burst) కారణంగా సంభవించిన వరదలు జన జీవనాన్ని అస్తవ్యస్థం చేశాయి. వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన వారి సంఖ్య తాజాగా 82 కు చేరింది. లాచెన్, లాచుంగ్(Lachen, Lachung) పట్టణాలలో 3 వేల మంది పర్యాటకులు(Tourists) చిక్కుకుపోయినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.
సిక్కింలో క్లౌడ్ బరస్ట్(Cloud Burst) వల్ల సంభవించిన ఆకస్మిక వరదల్లో(Floods) తప్పిపోయిన వారి మృతదేహాలు పదులు సంఖ్యలో బయటపడుతున్నాయి. ఇప్పటివరకు 55 మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.