Share News

Palla Srinivasa Rao: ఎమ్మెల్యే కొలికపూడి ఇష్యూపై పల్లా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Mar 29 , 2025 | 03:56 PM

Palla Srinivasa Rao: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం టీడీపీకి సమస్యగా మారింది. తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ నేత రమేష్ రెడ్డి, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈరోజు తిరువూరు నుంచి భారీగా టీడీపీ కార్యకర్తలు మంగళగిరి పార్టీ కార్యాలయానికి రావడంతో చర్చనీయాంశంగా మారింది.

Palla Srinivasa Rao: ఎమ్మెల్యే కొలికపూడి  ఇష్యూపై పల్లా శ్రీనివాసరావు  షాకింగ్ కామెంట్స్
Palla Srinivasa Rao

అమరావతి: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి తిరువూరు పంచాయతీ చేరింది. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఇవాళ (శనివారం) తిరువూరు టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా తిరువూరు నియోజకవర్గ టీడీపీ నేతలు ఒకటయ్యారు. టీడీపీ నేత రమేష్ రెడ్డికి అనుకూలంగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. డౌన్ డౌన్ కొలికపూడి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తిరువూరుకు కొలికపూడి వద్దు అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.


కార్యకర్తలను టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సముదాయించారు. తిరువూరు ముఖ్య నేతలతో పల్లా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. పార్టీయే సుప్రీమ్, పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంతటి వారైనా చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని వార్నింగ్ ఇచ్చారు. కార్యకర్తల అభిప్రాయాలను పార్టీ అధినేత చంద్రబాబు, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కొలికపూడిపై ఆరోపణలు చేస్తున్న రమేష్ రెడ్డి వ్యవహారం తమ దృష్టికి ఇంకా రాలేదని పల్లా శ్రీనివాస్ తెలిపారు. రమేష్ రెడ్డిపై ఎవరూ కూడా తమకు ఫిర్యాదు చేయలేదని అన్నారు. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఉంటాయని.. తిరువూరు వ్యవహారం కూడా అలాంటిదేనని చెప్పారు. త్వరలోనే తిరువూరు సమస్యను పరిష్కరిస్తామని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP News: కొలిక్కి రాని కొలికపూడి ఇష్యూ.. తిరువూరులో ఉత్కంఠ..

Good News To Youth: ఉద్యోగాల పండగ.. టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో సీఎం గుడ్‌న్యూస్

CM Chandrababu: ప్రజా సేవకు పునరంకితం అవుతామని సంకల్పం చేస్తున్నా...

For More AP News and Telugu News

Updated Date - Mar 29 , 2025 | 04:33 PM