Share News

LokSabha Elections: మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్

ABN , Publish Date - Jun 01 , 2024 | 05:24 PM

సినిమా విడుదలయ్యే ముందు ట్రైలర్ విడుదలైనట్లు.. జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఆ క్రమంలో మరికాసేపట్లో పలు సర్వే సంస్థలు, వివిధ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల ద్వారా ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించనున్నాయి.

LokSabha Elections: మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్
Exit polls 2024

సినిమా విడుదలయ్యే ముందు ట్రైలర్ విడుదలైనట్లు.. జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఆ క్రమంలో మరికాసేపట్లో పలు సర్వే సంస్థలు, వివిధ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల ద్వారా ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించనున్నాయి. లోక్‌సభ ఎన్నికలతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి.

మరి దేశంలో సామాన్య ఓటరు.. కేంద్రంలో ఏ పార్టీకి పట్టం కట్టనున్నాడనేది ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా కాస్తా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆ యా రాష్ట్రాల్లోని ఓటరు.. గత ప్రభుత్వాన్ని కొనసాగింపుగా ఆ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఓటు వేశాడా? లేకుంటే ప్రతిపక్ష పార్టీకి ఓటు వేసి.. అధికారంలోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేశాడా? అనేది ఈ ట్రైలర్ ద్వార కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Also Read: విమానానికి మళ్లీ బాంబు బెదిరింపు


దేశవ్యాప్తంగా జరిగిన లోక్‌సభ ఎన్నికలు.. మొత్తం 7 దశల్లో జరిగాయి. ఏప్రిల్ 19న మొదలైన తొలి దశ పోలింగ్.. జూన్ 1వ తేదీతో తుది దశ పోలింగ్ ముగిసింది. తొలి దశలోనే ఈశాన్య రాష్ట్రాల్లోని సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకే దశలో జరిగాయి. ఇక నాలుగో దశ పోలింగ్‌లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఒక దశలోనే పోలింగ్ జరిగింది.

Also Read: ఆరోపణలపై స్పందించిన డిప్యూటీ సీఎం

అయితే ఒడిశా అసెంబ్లీకి మూడు దశల పోలింగ్ జరిగింది. ఇవి అయిదో దశ నుంచి మొదలై.. ఏడో దశ.. అంటే చివరి దశ వరకు జరిగాయి. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ రోజు.. దేశ ఓటరు ముచ్చటగా మూడోసారి మోదీ ప్రభుత్వానికి జై కొడతాడా? లేకుంటే ఇండియా కూటమికి అధికారాన్ని అప్పగిస్తాడా? అనేది తెలియాలంటే.. మంగళవారం జూన్ 4వ తేదీ వరకు ఆగక తప్పదన్నది సుస్పష్టం.

Also Read: ముందు ఓటు.. తర్వాతే తల్లీ అంత్యక్రియలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Updated Date - Jun 01 , 2024 | 06:06 PM