Virat Kohli Dance Video: కోహ్లీ క్రేజీ డ్యాన్స్.. ఇక వాళ్లకు నిద్రపట్టదు
ABN , Publish Date - Mar 29 , 2025 | 04:02 PM
RCB Dressing Room: టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక్క విజయంతో అతడి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. ఆనందం తట్టుకోలేక డ్యాన్సులు కూడా చేస్తున్నాడు కింగ్.

విజయం.. ఈ మాట విని 17 ఏళ్లు. ఎన్ని జట్లను ఓడించినా సంతోషం లేదు. ఆ చాంపియన్ టీమ్‌ను వాళ్ల సొంతగడ్డపై ఓడించి తీరాలనే పంతం. దశాబ్దంన్నరలో ఎన్నో మారాయి. కానీ వాళ్ల కంచుకోటను మాత్రం బద్దలు కొట్టలేకపోయారు. అయితే దీనంతటికీ శుక్రవారంతో ఎండ్ కార్డ్ పడింది. చెన్నై సూపర్ కింగ్స్‌ను వాళ్ల సొంతగడ్డ చెపాక్ స్టేడియంలో 50 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. అంతే ఏళ్లుగా వేచిన విజయం రావడంతో టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆనందం పట్టలేకపోయాడు. చిన్న పిల్లాడిలా మారి సెలబ్రేట్ చేసుకున్నాడు.
సహచరులతో కలసి..
సీఎస్‌కేను వాళ్ల అడ్డాలోనే మట్టికరిపించడంతో కోహ్లీ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. మ్యాచ్ ముగిశాక అందరు ఆర్సీబీ ఆటగాళ్లను హత్తుకొని తన సంతోషాన్ని పంచుకున్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లోనైతే సహచర ఆటగాళ్లతో కలసి క్రేజీ డ్యాన్స్ స్టెప్స్ వేశాడు కింగ్. ఓ పాప్ సాంగ్‌కు తగ్గట్లు స్టెప్స్ వేశాడు. జ్యూస్ తాగుతూ కూడా డ్యాన్స్ మూవ్స్ ఆపలేదు. కోహ్లీతో పాటు దేవ్‌దత్ పడిక్కల్, లుంగి ఎంగిడి, ఫిల్ సాల్ట్ తదితరులు కూడా డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. సీఎస్‌కేపై వచ్చిన విజయం కిక్ ఇప్పట్లో ఆర్సీబీని వదిలేలా లేదు. ఇది చూసిన నెటిజన్స్.. కోహ్లీ అండ్ కో డ్యాన్సులు చూస్తే సీఎస్‌కే సపోర్టర్స్‌కు నిద్రపట్టదని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. తదుపరి మ్యాచులకూ ఇదే జోష్ రిపీట్ అయితే ఇక బెంగళూరుకు ఢోకా లేదని అంటున్నారు.
ఇవీ చదవండి:
కోహ్లీతో పెట్టుకున్నాడు.. ఇక కెరీర్ ఖతం
మ్యాచ్ పోయినా రికార్డు మిగిలింది
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి