Share News

Earthquake: బాబోయ్.. మయన్మార్‌లో మళ్లీ భూకంపం..

ABN , Publish Date - Mar 29 , 2025 | 04:00 PM

Earthquake in Myanmar: వరుస భూకంపాలు మయన్మార్‌ను వణికిస్తున్నాయి. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఓవైపు సహాయక చర్యలు కొనసాగుతుండగానే.. మరోసారి భూకంపం సంభవించింది.

Earthquake: బాబోయ్.. మయన్మార్‌లో మళ్లీ భూకంపం..
Earthquake in Myanmar

Earthquake Updates: మయన్మార్‌లో మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.7 భూకంప తీవ్రత నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఈ భూకంపానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఇకపోతే.. శుక్రవారం నాడు సంభవించిన భూకంపం ధాటికి మయన్మార్ జనాలు విలవిల్లాడుతున్నారు. వెయ్యికి పైగా జనాలు మృత్యువాత పడగా.. 2 వేలకు పైగా జనాలు తీవ్రంగా గాయపడ్డారు. మతుల సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో.. మళ్లీ భూకంపం సంభవించడంతో.. అక్కడి జనాలు ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.


అండగా భారత్..

భూకంపం ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మయన్మార్ ప్రజలకు భారత్ అండగా నిలుస్తోంది. బాధిత ప్రజలకు సాయం అందిస్తోంది. తాజాగా ఇండియన్ నావీ షిప్స్ ఐఎన్ఎస్ సాత్పురా, ఐఎన్ఎస్ సావిత్రి ద్వారా 40 టన్నుల నిత్యావసరాలను ఇతర వస్తువులను పంపిస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు.

Updated Date - Mar 29 , 2025 | 04:00 PM