Home » Singareni Collieries
సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని, శ్రావణపల్లి బొగ్గు బ్లాకులను వేలం జాబితా నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. సింగరేణిలో తెలంగాణ సర్కార్‌కు 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటాలున్నాయని ఆయన గుర్తు చేశారు.
సింగరేణి ప్రాంతంలో 18 వేలకు పైగా మొక్కలు నాటించి, 6 జిల్లాల్లో 35 చిట్టడవులను పెంచడంలో కీలకంగా వ్యవహరించినందుకుగాను సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ట్రీ మాన్ ఆఫ్ తెలంగాణ అవార్డును అందుకున్నారు.
సింగరేణిని ప్రైవేటీకరించేందుకే తెలంగాణ బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం వేలం వేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌లో సింగరేణి ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతోపాటు బొగ్గు గని కార్మిక సంఘం నాయకులతో కేటీఆర్ సమావేశమయ్యారు.
బొగ్గు గనుల వేలానికి నిరసనగా జూలై 5న కోల్‌బెల్ట్ బంద్‌కు పిలుపునిచ్చినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. 15 రోజులపాటు సీపీఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు, కలెక్టరేట్ల ముట్టడి చేపడతామని చెప్పారు.
సింగరేణి గనులను సింగరేణికే కేటాయించేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని, ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) సింగరేణి కోల్‌బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ డిమాండ్ చేశారు.
గనుల తవ్వకం, పర్యావరణ పరిరక్షణ దేశానికి రెండు కళ్లలాంటివని, వీటికి తాము సమ ప్రాధాన్యమిస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం ఢిల్లీలో కీలకమైన, తక్కువగా లభించే ఖనిజాల (క్రిటికల్ మినరల్) గనుల నాలుగో విడత వేలాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ‘
గనుల తవ్వకం, పర్యావరణ పరిరక్షణ దేశానికి రెండు కళ్లలాంటివని, వీటికి తాము సమ ప్రాధాన్యమిస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
బొగ్గు గనుల వేలం సింగరేణి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. వరుసగా తెలంగాణలోని బొగ్గు గనులను కేంద్రం వేలం వేస్తుండటంతో.. తవ్వేందుకు సింగరేణికి గనులు కరువయ్యే పరిస్థితి నెలకొంది.
ఓవైపు బొగ్గు నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి. మరోవైపు బొగ్గు బ్లాకులు ప్రైవేటు సంస్థల పాలవుతున్నాయి. బొగ్గు నిక్షేపాలు కళ్లముందే కనిపిస్తున్నా.. ప్రభుత్వ అనుమతి లేనందున వేలం పాటకు వెళ్లలేక, వాటిని దక్కించుకోలేని దీన స్థితి.
రాష్ట్రానికి మణిహారంగా ఉన్న సింగరేణి సంస్థను దివాలా తీయించేలా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలం పాట ప్రారంభించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం విమర్శించారు.