Share News

KTR: తెలంగాణ బొగ్గు గనులను వేలానికి పెట్టిన ‘ఆ రెండు పార్టీలు’

ABN , Publish Date - Jun 27 , 2024 | 03:44 PM

సింగరేణిని ప్రైవేటీకరించేందుకే తెలంగాణ బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం వేలం వేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌లో సింగరేణి ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతోపాటు బొగ్గు గని కార్మిక సంఘం నాయకులతో కేటీఆర్ సమావేశమయ్యారు.

KTR: తెలంగాణ బొగ్గు గనులను వేలానికి పెట్టిన ‘ఆ రెండు పార్టీలు’
BRS Working President KTR

హైదరాబాద్, జూన్ 27: సింగరేణిని ప్రైవేటీకరించేందుకే తెలంగాణ బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం వేలం వేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌లో సింగరేణి ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతోపాటు బొగ్గు గని కార్మిక సంఘం నాయకులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వంతో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కై.. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అందుకే సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆ తర్వాత సింగరేణి నష్టాల్లో ఉందంటూ పెట్టుబడుల ఉపసంహరణ కోసం రంగం సిద్ధం చేస్తున్నారని విమర్శించారు.

అయితే కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై సింగరేణి గనులను అమ్మకానికి పెట్టిన విషయం.. ప్రతి సింగరేణి కార్మికుని అర్థమవుతోందన్నారు. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన సకల జనుల సమ్మె కారణంగా సింగరేణి ప్రాధాన్యతను దేశం గుర్తించిందని చెప్పారు. ఈ సమ్మె జరిగిన సమయంలో.. దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయని ఈ సందర్బంగా కేటీఆర్ గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతమే మన పార్టీ విధానమని కేటీఆర్ పునరుద్ఘాటించారు.

Also Read: South Central Railway: హైదరాబాద్ - న్యూఢిల్లీ మార్గంలో పలు రైళ్లు రద్దు


ఉద్యమ కాలంలోనే కాదు.. అనంతర ప్రభుత్వంలో ఉన్నప్పుడు సైతం తమది ఇదే విధానమన్నారు. అందుకే ప్రైవేటు కంపెనీల ఒత్తిడులను పక్కన పెట్టి... రైతు బీమాను ఎల్ఐసీ ఇచ్చామని పేర్కొన్నారు. అలాగే విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలను సైతం బీహెచ్ఈఎల్‌కి అప్పగించామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ హాయాంలో తెలంగాణ బొగ్గు గనులను వేలం వేయకుండా ఆపగలిగారన్నారు. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రెండు బొగ్గు గనులను ప్రైవేట్ సంస్థలకు కేటాయించినప్పటికీ.. తట్టెడు తెలంగాణ బొగ్గును ఎత్తకుండా విజయవంతంగా అడ్డుకున్నామని కేటీఆర్ వివరించారు.

Also Read: AIIMS: ఆసుపత్రి నుంచి ఎల్ కె అద్వానీ డిశార్జ్

అయితే కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు.. ఆ పార్టీ నాయకత్వం కలిసికట్టుగా తెలంగాణ బొగ్గు గనులను వేలానికి పెట్టాయని మండిపడ్డారు. పార్లమెంట్‌లో తెలంగాణ గొంతుక లేదన్న ఓ విధమైన భ్రమతోనే కాంగ్రెస్, బీజేపీలు ఈ కుటిల ప్రయత్నాలకు తెర తీశాయన్నారు. సింగరేణి కోసం మొదటి నుంచి పోరాటం చేసి... ఆ సంస్థను బలోపేతం చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. సింగరేణి కష్టాల్లో ఉంటే కార్మికులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందన్న విషయాన్ని సైతం ఆ యా పార్టీల నేతలు మర్చిపోతున్నారన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణిని కాపాడుకుంటామని ఆ ప్రాంత నేతలకు ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారు.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 27 , 2024 | 03:46 PM