Share News

Communist Member Prabhat: బొగ్గు బ్లాకులను వేలం వేయొద్దు

ABN , Publish Date - Jun 26 , 2024 | 03:17 AM

సింగరేణి గనులను సింగరేణికే కేటాయించేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని, ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) సింగరేణి కోల్‌బెల్ట్‌ కమిటీ కార్యదర్శి ప్రభాత్‌ డిమాండ్‌ చేశారు.

 Communist Member  Prabhat: బొగ్గు బ్లాకులను వేలం వేయొద్దు

  • మావోయిస్టు నాయకుడు ప్రభాత్‌

గోదావరిఖని, జూన్‌ 25: సింగరేణి గనులను సింగరేణికే కేటాయించేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని, ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) సింగరేణి కోల్‌బెల్ట్‌ కమిటీ కార్యదర్శి ప్రభాత్‌ డిమాండ్‌ చేశారు. సింగరేణి ప్రాంతంలోని బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం బహిరంగ వేలం పాటలో పెట్టి ప్రైవేటీకరించే విధానాన్ని కోల్‌బెల్ట్‌ ప్రాంతంలోని సకల జనులు ఖండించాలని, బొగ్గు బ్లాకులను కాపాడుకునేందుకు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో.. తెలంగాణ కోసం చేసిన సకల జనుల సమ్మె పోరాటాన్ని అధిగమించే స్థాయిలో మిలిటెంట్‌ పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. బెల్ట్‌ ప్రాంత కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులంతా బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణపై క్రియాశీలంగా స్పందించాలన్నారు. బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా కార్మికవర్గం చేపట్టే పోరాటాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి ఉద్యమించాలని కోరారు.

Updated Date - Jun 26 , 2024 | 09:49 AM