Home » Singareni Collieries
సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా..? అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
తెలంగాణ బిడ్డగా సింగరేణికి అన్యాయం చేయబోనని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. సింగరేణి భవిష్యత్తు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికే కాకుండా 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటుందని సింగరేణిపై తెలంగాణ ప్రభుత్వానికే కాకుండా కేంద్రానికి కూడా బాధ్యత ఉంటుందని గుర్తు చేశారు.
‘‘ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీకి 16 ఎంపీ సీట్లిస్తే విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపగలిగింది. రాష్ట్ర ప్రజలు కాంగ్రె్‌సకు 8, బీజేపీకి 8 ఎంపీ సీట్లు కట్టబెడితే.. ఆ రెండు పార్టీలు సింగరేణిని ఖతం చేయాలని చూస్తున్నాయి’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
రాష్ట్రంలో సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గు గనులను కేద్ర ప్రభుత్వం వేలం వేస్తే ఊరుకోబోమని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క చెప్పారు. రాష్ట్రం తరఫున పోరాడి తీరతామని స్పష్టం చేశారు. ఖమ్మం కలెక్టరేట్‌లో గురువారం వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రంలో బొగ్గు గనుల వేలంపై సెంటిమంటలు అంటుకున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని రెండు బొగ్గు నిక్షేపాల బ్లాక్‌లను దాదాపు రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం వేలం వేయగా... తాజాగా మరో మూడో బ్లాక్(శ్రావణపల్లి)ని శుక్రవారం వేలం వేస్తున్నారు.
సింగరేణిని ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
సింగరేణిని ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటుపరం చేస్తుందని ఎన్నికల్లో ఓట్ల కోసం బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ అసత్య ప్రచారం చేశారని, అదంతా ఆయన ఆడిన డ్రామా అని మండిపడ్డారు.
సింగరేణిలో కారుణ్య నియామకాల గరిష్ఠ వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. కారుణ్య నియామకాల ఉద్యోగార్థుల వయోపరిమితిని పెంచాలని కార్మికులు దీర్ఘకాలంగా కోరుతుండగా.. ఇటీవలే వారికి సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.
సాధారణంగానే సింగరేణి ఏరియాలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది.ఇక ఎండాకాలంలో ఈ ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది. ప్రస్తుతం ఎండలు మరింత తీవ్రతరమయ్యాయి. భానుడు మంటలు మండిస్తున్నాడు. ఉదయం 8 గంటలకే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నారు. ఇక మధ్యాహ్న సమయంలో అయితే భగభగ మండిపోతున్నాడు. ఇక సాధారణ ప్రాంతాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే కోల్‌బెల్ట్ ప్రాంతంలో ఎలా ఉంటుంది?
Singareni Job Notification: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. 485 ఖాళీలను భర్తీ చేసేందుకు సిద్ధమైంది సింగరేణి సంస్థ. వీటి భర్తీకి సంబంధించి గురువారం(ఫిబ్రవరి 22) నాడు నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ విషయాన్ని సంస్థ సీఎండీ ప్రకటించారు.