Home » Srikakulam
గత వైసీపీ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను సైతం ప్రస్తుత ప్రభుత్వమే చెల్లించినట్లు మంత్రి నాదెండ్ల మహోహర్ తెలిపారు. ఈ ఏడాది సంక్రాంతి రాకముందే రైతులు కళ్లల్లో ఆనందం కనపడుతోందని మంత్రి చెప్పుకొచ్చారు. రైతులకు అండగా నిలబడేందుకే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.
శ్రీకాకుళం: జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఆర్మీ శిక్షణ పేరుతో నిరుద్యోగిని చిత్ర హింసలకు గురి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సంస్థను రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఏర్పాటు చేశాడు. నిరుద్యోగులకు ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని, శిక్షణ ఇస్తానని ప్రకటనలు చేస్తూ నిరుద్యోగులను ఆకర్షిస్తున్నాడు. ఈ నేపథ్యంలో..
వైసీపీ నేత.. ధర్మాన కృష్ణదాస్ మాజీ పీఏ గొండు మురళీ అవినీతి బాగోతం బట్టబయలైంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే అభియోగాలపై ఇటీవల ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందింది. ఏసీబీ డైరెక్టర్ ఆఫ్ జనరల్ అతుల్సింగ్ ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. గురువారం జిల్లాతోపాటు విశాఖలోనూ ఏకకాలంలో ఆరు చోట్ల తనిఖీలు నిర్వహించారు.
వైసీపీ మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాజీ పీఏ గొండు మురళి ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గురువారం శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఏకకాలంలో ఆకస్మిక సోదాలు నిర్వహించింది.
సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా పర్యటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు స్పందించారు. చంద్రబాబు పర్యటన చాలా సాదా సీదాగా జరిగిందన్నారు. జిల్లాలో సమస్యలపై ఓ సీఎం ఇలా సమీక్ష చేయడం ప్రపంచంలో గతంలో ఎక్కడ జరగలేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రజా ముఖ్యమంత్రి అని అభివర్ణించారు.
సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురంలో ఈ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్దిదారుడి ఇంట్లో సీఎం చంద్రబాబు టీ పెట్టారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే చంద్రబాబు దీపావళి పండుగ సందేశంతో పాటు దీపం పథకం 2.0 గురించి చెప్పారు. దీపావళి కానుకగా శ్రీకాకుళం జిల్లా నుండి ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసేందుకు సిద్ధం అయ్యారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో హద్దుమీరి రెచ్చిపోయిన.. రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ను పోలీసులు బుధవారం రాత్రి శ్రీకాకుళం కోర్టులో హాజరుపరిచారు.
రణస్థలం మండలం చిల్లపేట రాజాం పంచాయతీ బొడ్డపాడులో పురాతన శివాలయాన్ని దుండగులు బుధ వారం రాత్రికి రాత్రే నేలమట్టం చేశారు. ఈ విధ్వంసానికి పాల్పడింది ఎవరో తేల్చాలని ఆలయ పూజారి ఫణిశర్మ అధికారులను కోరారు.
దీపావళి... పండుగ అని తెలుసు. కానీ ఓ ఊరు పేరు దీపావళి అని తెలుసా. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో దీపావళి అనే గ్రామం ఉంది. అసలు ఆ పేరెలా వచ్చింది. ఊరు ప్రత్యేకత ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం.